Mukesh Kumar Meena: మీరు ఓటు వేయండి.. ప్రతి ఒక్కరితో ఓటు వేయించండి అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కామెంట్స్.. గుంటూరులో పర్యటించిన ఆయన.. మొదటి సారి ఓటు వేయనున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.. ఓటు వేయడం, మన హక్కు మాత్రమే కాదు, భారత దేశ పౌరుడిగా మన భాధ్యత అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యన్ని పరి పుష్టి చేయడానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అనే భాధ్యత తీసుకోవాలని సూచించారు. మీరు ఓటు అనే పండుగలో మీ హక్కు వినియోగించుకోవడం కోసం, ఎన్నికల కమిషన్ విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు.. మీరు ఓటు వేయండి.. ప్రతి ఒక్కరితో ఓటు వేయించండి అని సూచించారు ముఖేష్ కుమార్ మీనా.
Read Also: Gannavaram: గన్నవరంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయం..!
ఇక, గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే, కొన్ని అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందన్నారు ముఖేష్ కుమార్ మీనా.. విద్యార్థులు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారాని గుర్తించాం.. వారిని పోలింగ్ బూత్‌కు తీసుకొచ్చే విధంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.. అయితే, ఈ ఎన్నికల్లో 83 శాతం ఓటింగ్ పర్సంటేజ్ లక్ష్యంతో పనిచేస్తున్నాం అని వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. కాగా, ఇప్పటికే రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా.. మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది.. దీనికి ఎన్నికల కమిషన్ పూర్తిస్థాయి ఏర్పాట్లలో మునిగిపోయింది.