జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు.. పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్‌ను ఓడించలేకపోతేనే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు..
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాసు గుర్తు టెన్షన్ పెడుతోంది. గాజు గ్లాసు ఫ్రీ సింబల్‌గా ఉండటంతో.. జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాసు కేటాయిస్తున్నారు అధికారులు. దీంతో.. కూటమి నేతల్లో ఆందోళన కనిపిస్తోంది. తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు.
ఈ రోజు టీడీపీ - బీజేపీ - జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది.
అమెరికా నుంచి కాదు కదా.. అంతరిక్షం నుండి వచ్చినా గుడివాడలో నన్ను ఓడించలేరని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో నందివాడ మండలంలో కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఏపీలో ఎన్నికల వేళ అధికారులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(SEB) అధికారులు పట్టుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. లక్ష్మీపురం గ్రామంలో కొలికపూడి శ్రీనివాసరావుకు గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు.
సొంత ఇంటికి దారి వేయించుకోలేని వ్యక్తి ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే వాసు బాబు అని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. పేకాట నడపడం ద్వారా ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆరోపించారు. పేకాటలో క్లబ్బులు నడిపే వాళ్ళు కావాలా.. డీఎస్సీ ఇచ్చే వాళ్ళు కావాలా అంటూ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.