తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కొర్రపాడు, విశదల, మందపాడు, సిరిపురం, వరగాని గ్రామాల్లో పర్యటించారు.
అభివృద్ధి విషయంలో నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. అలాంటి బాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు..? అని ప్రశ్నించారు ఏపనీ సీఎం వైఎస్ జగన్.. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకుడంటే ప్రజల్లో నమ్మకముండాలి.. ఒక మాట చెప్తే చేస్తాడన్న నమ్మకం ఆ నాయకుడిపై ఉండాలి అన్నారు
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గ పరిధిలోని నందిగామ పట్టణంలోని ఆర్ టి ఓ కార్యాలయం రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తనధైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది సీఎం జగన్ మాత్రమేనని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీలకు జరిగిన మంచిని వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న పలు బీసీ సంఘాల నాయకులు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గాజు గ్లాస్ టెన్షన్ పెడుతుంది.. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎలక్షన్ కమిషన్.. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది.. అయితే, ఈ పరిణామాలపై హైకోర్టు మెట్లు ఎక్కింది జనసేన పార్టీ.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడాన్నరి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై విచారణ ప్రారంభం కాగా.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి..