AP Weather: ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 78 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 273 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శ్రీకాకుళం 12, విజయనగరం 23, పార్వతీపురంమన్యం 14, విశాఖ 1, అనకాపల్లి 8 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (169):
శ్రీకాకుళం 13, విజయనగరం 3, పార్వతీపురంమన్యం 1, అల్లూరిసీతారామరాజు 9, విశాఖ 2, అనకాపల్లి 10, కోనసీమ 5, కాకినాడ 17, తూర్పుగోదావరి 4, పశ్చిమ గోదావరి 1, ఏలూరు 11, కృష్ణా 9, ఎన్టీఆర్ 6, గుంటూరు 14, పల్నాడు 22, బాపట్ల 3, ప్రకాశం 14, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 1, శ్రీసత్యసాయి 1, వైయస్సార్ 4, అన్నమయ్య 1, తిరుపతి 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
Read Also: Kodali Nani: ఎన్టీఆర్, వైఎస్సార్ నాకు రెండు కళ్లు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
శుక్రవారం నంద్యాల జిల్లా గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీలు, ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3 డిగ్రీలు, వైయస్సార్ జిల్లా చిన్నచెప్పలిలో 47.2 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1, తిరుపతి జిల్లా పెద్దకన్నాలిలో 46.9, కర్నూలు జిల్లా పంచాలింగాలలో 46.8, చిత్తూరు జిల్లా తవణంపల్లె, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 15 జిల్లాలో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 63 మండలాల్లో తీవ్రవడగాల్పులు,208 మండలాల్లో వడగాల్పులు వీచాయి.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.