జగన్ సంభాషణ చూస్తే రాజశేఖర్ రెడ్డి గుర్తొచ్చారని.. ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసేసరికి భావోద్వేగానికి గురయ్యానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అది యాక్షన్ కాదు, ఆటోమేటిక్‌గా వచ్చింది.. దానికి సమాధానం చెప్పలేనన్నారు.
సిద్ధం, మేమంతా సిద్ధం బస్సు యాత్రలతో ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు మూడో విడత ప్రచారం నిర్వహిస్తున్నారు. రోజుకు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
నంద్యాల జిల్లా డోన్‌లో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13వ తేదీ దొంగలను పట్టుకోవడానికి సిద్ధమా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పిట్టకథల మంత్రికి, కట్టుకథల నేతలకు కాలం చెల్లిందన్నారు. అప్పులు చేసేది బుగ్గన...అప్పులు కట్టేది జనమని.. కోట్ల దెబ్బకి బుగ్గన పారిపోతాడన్నారు.
మండుటెండలో సైతం ఆత్మీయ అభిమానం చూపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీ పార్టీ జోరు పెంచింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావులు హాజరయ్యారు.
బొబ్బిలి, విజయనగరం ఎంపీగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై స్పందించి, పరిష్కరించానని సగర్వంగా చెప్పగలనని విశాఖ పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. ఒకప్పుడు రైల్వే గేట్లు సరిగ్గా ఉండేవి కాదని.. ఆ అంశాలన్నీ పార్లమెంట్లో ప్రస్తావించి పనులు చేయించానన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. కాసేపట్లో అభ్యర్థుల తుది జాబితాను రిటర్నింగ్ అధికారులు విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు దాఖలయ్యాయి.
మరో రెండు వారాల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. పేదలకు, మోసకారి చంద్రబాబుకు మధ్య పోటీ అని సీఎం జగన్ అన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఉండవన్నారు. చంద్రముఖి మీ ఇంటి తలుపు తట్టి 5 ఏళ్లు మీ రక్తం పీల్చేస్తారని.. ఒకే ఒక్కడిని ఓడించడానికి అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.