ఏపీ శాసన మండలి సమావేశాలు మొదటి రోజే వాడివేడిగా జరిగాయి. మండలి మొదటి రోజు వాయిదాల పర్వం కొనసాగింది. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చకు వైసీపీ పట్టు పట్టింది.. రైతు సమస్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన తో సభ మొదటి సారి వాయిదా పడింది. మరోవైపు తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనల పైనా సభలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. తిరుమల సంఘటనలపై మంత్రి ఆనం తీరుకి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ..
"చంద్రబాబు గారూ.. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల…
Off The Record: నా బంగారం… అసెంబ్లీలో కొరమీనంత మైకట్టుకోని అధ్యచ్చా…. అంటుంటే దాన్ని నేను టీవీలో చూసి మురిసిపోవాల. ఓ పాపులర్ సినిమాలో విలన్ డైలాగ్ ఇది. సినిమా కాబట్టి విలన్ నోట్లో నుంచి ఆ డైలాగ్ వచ్చినా… బయట చాలామంది పొలిటికల్ హీరోల డ్రీమ్ ఇది. సినిమాలో భార్యను ఉద్దేశించి విలన్ అన్నా… నిజ జీవితంలో మాత్రం ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలై పోవాలని కలలుగంటుంటారు. అధ్యక్షా అన్న మూడక్షరాలు పలకడానికి కొందరు నాయకులకు జీవితకాలం…
Off The Record: విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ బలమైన రాజకీయ పక్షాలు. పునర్విభజన తర్వాత ఏర్పడిన ఈ స్థానంపై పట్టుసాధించేందుకు ప్రధాన పార్టీలు గట్టిగానే పోరాడుతుంటాయి. 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2014లో కూటమి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు. ఇక 2019లో ఒంటరిగా పోటీ చేసిన టీడీపీ స్వల్ప మెజారిటీతో బయటపడింది. ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన విష్ణు నాలుగో స్థానంతో…