Red Alert: రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఇక, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.. మరోవైపు, ఈ సమయంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈ తరుణంలో చెట్ల కింద ఉండకండి.. అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
Read Also: Prithvi Shaw: బ్యాట్ ఎత్తడం, కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం.. పృథ్వీ షా ఇక మారాడా?