కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఊరి చివర పొలాల మధ్య బావిలో అదే గ్రామానికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలు గుర్తించారు స్థానికులు.. ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన గంగాధర్ చంపి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు..
Off The Record: వైసీపీ ప్రభుత్వ హయాంలో… 2022లో జిల్లాల పునర్విభజన జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు లోక్సభ నియోజకవర్గాల ప్రకారం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. రాజమండ్రి కేంద్రంగా తూర్పుగోదావరి, అమలాపురం కేంద్రంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా, మూడోది కాకినాడ జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో…అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఉన్న రామచంద్రపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు వాసంశెట్టి సుభాష్. ఆయన సొంత నియోజకవర్గం అమలాపురం అయినా… అది…
ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుఅవుతారా? లేదా? అనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది..
సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్ట్ ల పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.. మంత్రులు వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథిలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది కూటమి సర్కార్.. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది..
యూరియా అంశంలో కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని వదంతులు సృష్టించి శాంతిభద్రతల సమస్య తీసుకురావాలనే ప్రయత్నం జరిగిందన్నారు.. అమెరికా నుంచి 750కి పైగా తప్పుడు పోస్టులు పెట్టారన్నారు.. రైతులు - ప్రభుత్వం మధ్య వివాదం సృష్టించే ప్రయత్నం చేశారన్నారు సీఎం చంద్రబాబు.. కలెక్టర్ కాన్ఫెరెన్సు లో శాంతి భద్రతల పై సీఎం సమీక్ష నిర్వహించారు.. అత్యుత్తమ పనితీరు.. టెక్నాలజీ క్రైం రేట్ తగ్గించడంలో ముఖ్యమైనవి అన్నారు సీఎం…
ఉద్యోగులు డ్యూటీకి వెళ్లకపోతే జీతం కట్ చేస్తారు.. మరి, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? అని ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..
గంజాయి రవాణాకు, సరఫరాకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న విశాఖలో స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు సరికొత్త ప్లాన్ వేసారు.. రైల్లలోను, బస్సుల్లోను, ఇతర వాహనాల్లో వందల కేజీల కొద్ది గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా బోర్డర్లు దాటించేస్తున్నారు.. పెడ్లర్లు, స్మగ్లర్ల ఎత్తుగడలకు పోలీసుల సైతం ఆశ్చర్యపోతున్నారు.. బ్యాగుల్లో, మూటల్లో తరలిస్తున్న గంజాయిను పట్టుకోవడం కష్టతరం అవుతుంది. దీంతో నార్కోటిక్ స్పెషల్ ట్రైనింగ్ పొందిన డాగ్స్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు విశాఖ పోలీసు అధికారులు...