రెడ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
రానున్న మూడు గంటల్లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.. ఇక, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.. మరోవైపు, ఈ సమయంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈ తరుణంలో చెట్ల కింద ఉండకండి.. అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి అంటూ హెచ్చరికలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.
ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. పాస్ పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో తన పాస్ పోర్ట్ ను కోర్టులో సమర్పించారు మిథున్ రెడ్డి.. అయితే, యూఎస్ వెళ్లేందుకు తన పాస్ పోర్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్‌రెడ్డి.. ఇక, మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, దేశం విడిచి వెళ్లే సమయంలో అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది విజయవాడలోని ఏసీబీ స్పెషల్ కోర్టు.. దీంతో, ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట దక్కినట్టు అయ్యింది..
వాడివేడిగా వాదనలు.. బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టులో నేడు (బుధవారం) కీలక విచారణ సాగింది. బీసీల్లో వర్గాల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు జరగలేదని పలు పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో, విచారణ వాడివేడిగా కొనసాగింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున లాయర్ సుదర్శన్ వాదనలు వినిపించారు. అయితే, నిరంతరం అదే అంశాలను పునరావృతం చేస్తూ కోర్టు సమయాన్ని వృథా చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. ఇది చివరి విచారణ కాదు. అన్ని అంశాలను ఒకేసారి ప్రస్తావించవద్దు. మా ఓపికను పరీక్షించకండని కోర్టు స్పష్టం చేసింది. తర్వాత ప్రభుత్వం తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు కొనసాగించారు. ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయి. జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరికాదు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచే హక్కు కలిగి ఉందని తెలిపారు. అంతేకాకుండా.. “ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతం వరకు పెంచబడ్డాయి. ఈ ప్రక్రియలో 97 శాతం ఇంటింటి సర్వే జరిగింది. బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉంది. వారు దాన్ని ఆమోదించలేదు, తిరస్కరించలేదూ అని వివరించారు.
బీసీల కోసం పార్టీ పెట్టా.. కుల కుటుంబ పార్టీలను ఓడించేందుకు మా పార్టీలో చేరండి
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా.. “బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు, హైకోర్టులో పిటిషన్లు వేసి డ్రామాలు చేస్తోంది. ఆర్. కృష్ణయ్యతో సహా కొంతమంది బీసీ నేతలు కూడా డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు చిత్తశుద్ధి చూపలేకపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా, ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిగా చేయలేదు. గత 79 ఏళ్లలో 12 మంది రెడ్డి వర్గానికి చెందిన వారినే ముఖ్యమంత్రులుగా చేశారని ఆయన అన్నారు. కేవలం 5 శాతం ఉన్న రెడ్డిలకు అవకాశం ఇవ్వగా, 52 శాతం ఉన్న బీసీలకు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని మండిపడ్డారు. అలాగే, నేను బీసీల కోసం పార్టీ స్థాపించాను. బీసీల హక్కుల కోసం పోరాడటమే ప్రజాశాంతి పార్టీ లక్ష్యం అని స్పష్టం చేశారు కే.ఏ. పాల్. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే హనుమంతరావు, మల్లు రవి లేదా వివేక్ లాంటి బీసీ నేతలలో ఎవరికైనా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని.. కానీ, వాళ్లు బీసీలను కేవలం ఓట్ల బ్యాంక్‌గా మాత్రమే వాడుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు. కే.ఏ. పాల్ బీసీ వర్గానికి పిలుపునిస్తూ.. బీసీలు ఇక బానిసత్వం మానాలి. మూడు కుల కుటుంబ పార్టీలను ఓడించేందుకు ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు వేసే వారు, నిజంగా బీసీ హక్కులు కోరుకుంటే బీసీ పార్టీకి ఓటు వేయాలి అని అన్నారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కూడా స్పందించిన కే.ఏ. పాల్, జూబ్లీహిల్స్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. నేను స్వయంగా పోటీ చేస్తానా లేదా మరెవరినైనా నిలబెడతానా అన్నది త్వరలో ప్రకటిస్తానని అన్నారు.
కాశ్మీర్ అడవుల్లో ఇద్దరు పారా కమాండోలు మిస్సింగ్..
దక్షిణ కాశ్మీర్‌లోని కొకర్నాగ్ లోని దట్టమైన గడోల్ అటవీ ప్రాంతంలో సోమవారం నుంచి ఎలైట్ 5 పారా యూనిట్‌కు చెందిన ఇద్దరు ఆర్మీ కమాండోలు అదృశ్యమయ్యారు. దీంతో ఉమ్మడి భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. తప్పిపోయిన సిబ్బంది అగ్నివీర్ జవాన్లు అని విషయం తెలిసిన వారు చెబుతున్నారు. అక్టోబర్ 6 సాయంత్రం కిష్త్వార్, అనంత్ నాగ్ మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్ సమయంలో ఈ ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. వీరి మిస్సింగ్ తర్వాత వైమానిక నిఘా, ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కఠినమైన అటవీ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇప్పటికీ గోప్యంగా ఉన్నాయి. అయితే, ఈ అదృశ్యం వెనక ఉగ్రవాద ప్రమేయం లేదని తోసిపుచ్చుతున్నారు. ఈ ఇద్దరు జవాన్లు దారి తప్పి ఉండొచ్చని భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.
రాకేష్ కాకుండా, చీఫ్ జస్టిస్‌పై ‘‘అసద్’’ దాడికి పాల్పడుంటే..?
ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్, ఓ కేసులో శ్రీ మహా విష్ణువు గురించి వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలనే పిటిషన్‌పై..‘‘ మీరు విష్ణువు భక్తులు కదా, విష్ణువునే ఏమైనా చేయమని అడగండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సోమవారం రాకేష్ అనే 70 ఏళ్లకు పైబడిన న్యాయవాది కోర్టు హాలులో సీజేఐ బీఆర్ గవాయ్‌పై షూతో దాడికి పాల్పడ్డాడు. అయితే, సీజేఐ ఆదేశాల మేరకు, ఢిల్లీ పోలీసులు అతడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. అయితే, ఈ ఘటనపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఈ కేసులో రాకేష్ కాకుండా, షూ విసిరిన వ్యక్తి పేరు ‘‘అసద్’’ అయి ఉంటే పోలీసులు ఇలాగే స్వేచ్ఛగా వెళ్లనిచ్చేవారా..? అని ప్రశ్నించారు. ‘‘ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేయలేదు… ఎందుకంటే అతని పేరు రాకేష్ కిషోర్’’ అని ఓవైసీ అన్నారు. ‘‘అతని పేరు రాకేష్ కాదు, ‘అసద్’ అయితే, ఢిల్లీ పోలీసులు ఏమి చేసేవారు?’’ అని అడిగారు.
బ్యాట్ ఎత్తడం, కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం.. పృథ్వీ షా ఇక మారాడా?
ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాడు పృథ్వీ షా పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినబడుతోంది. నెట్టింట వార్తల్లో నిలిచేది ఆటతో మాత్రం కాదు. తన ఫిట్‌నెస్, డేటింగ్, వివాదాస్పద ప్రవర్తన కారణంగా పృథ్వీ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు. బీసీసీఐ సహా ముంబై జట్టు అతడిపై చర్యలు తీసుకున్నా.. మారడం లేదు. దురుసు ప్రవర్తనను అలానే కొనసాగిస్తున్నాడు. తాజాగా మాజీ సహచరుడి పైనే బ్యాట్ ఎత్తాడు. అక్కడితో ఆగకుండా కాలర్ పట్టుకోవడం, దుర్భాషలాడటం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ముంబై, మహారాష్ట్రల మధ్య మూడు రోజుల మ్యాచ్ జరుగుతోంది. మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా భారీ సెంచరీ (181) చేశాడు. పృథ్వీ బ్యాటింగ్ చూస్తే.. డబుల్ సెంచరీ పక్కా అని అందరూ అనుకున్నారు. ముంబై ఆల్‌రౌండర్ ముషీర్ ఖాన్ వేసిన బంతిని భారీ షాట్‌కు యత్నించిన పృథ్వీ.. లాంగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. పృథ్వీ డబుల్ సెంచరీ మిస్ అవ్వడంతో.. ముషీర్ సంతోషంలో ‘థాంక్యూ’ అని అన్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన పృథ్వీ.. తన బ్యాట్‌ను ముషీర్ వేగంగా వైపు తిప్పాడు. ముషీర్ తృటిలో ఆ ప్రమాదంను తప్పించుకున్నాడు.
హిజాబ్ ధరించిన దీపిక.. ఓ రేంజ్ లో ట్రోల్స్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మళ్లీ వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఆమె తన భర్త రణ్ వీర్ సింగ్ తో కలిసి ఎక్స్‌పీరియన్స్ అబుదాబి యాడ్ లో నటించింది. ఇందులో ఆమె హిజాజ్ ధరించింది. ఈ ప్రమోషనల్ యాడ్ లో ఇద్దరూ ఓ మ్యూజియంలో ఉంటారు. అక్కడ ఇద్దరూ కలిసి అబుదాబిని ప్రపంచంలోనే అత్యంత మేటి ప్రదేశం అన్నట్టు ప్రమోట్ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఈ యాడ్ లో ఆమె హిజాబ్ ధరించడం పెద్ద వివాదంగా మారిపోయింది. హిందూ అమ్మాయి అయి ఉండి డబ్బుల కోసం హిజాబ్ ధరిస్తావా అంటూ నెటిజన్లు ట్రోల్స్ మొదలెట్టారు. కావాలంటే నార్మల్ బట్టల్లోనే ప్రమోట్ చేసుకోవచ్చు కదా అంటున్నారు. అలా కాకుండా హిజాబ్ వేసుకుని ధరించి మరీ అక్కడి ప్రదేశాల గురించి మాట్లాడటం అంటే.. డబ్బుల కోసం ఏమైనా చేసేస్తా అని చెబుతున్నావా అంటూ ఏకిపారేస్తున్నారు. దీంతో దీపిక పేరు సోషల్ మీడియాలో మళ్లీ వివాదంగా మారింది. మొన్నటికి మొన్న ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమాతో పాటు కల్కి-2 నుంచి ఆమెను తీసేశారు. ఆమె పెట్టే కండీషన్లు భరించలేకనే ఇలా తీసేస్తున్నట్టు తెలిపారు. దీంతో ఆమె పేరు తీవ్ర వివాదంగా మారింది. ఇప్పుడు మళ్లీ ఈ విషయంలో ఇలా జరుగుతోంది. అయితే దీపిక ఫ్యాన్స్ మాత్రం ఇందుకు కౌంటర్ ఇస్తున్నారు. ఆమె గతంలో హిందూ ఆలయాలకు ఎలా వెళ్లిందో బయట పెడుతూ ఆ ఫొటోలను రిలీజ్ చేస్తున్నారు. ఆమె హిందూ సంప్రదాయాలను పాటించే అమ్మాయి అంటున్నారు.
ఎన్టీఆర్ బామ్మర్ది పెళ్ళి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో, స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది అయిన నార్నే నితిన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొద్ది రోజుల క్రితం యువతి శివానీతో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచిన నితిన్, తాజాగా తన పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నార్నే నితిన్-శివానీల నిశ్చితార్థ వేడుక గత ఏడాది నవంబర్ 3న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, హీరో కల్యాణ్ రామ్, వెంకటేష్, రానా దగ్గుబాటి, హారిక హాసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత చినబాబు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూసర్ నాగవంశీ తదితరులు హాజరై నూతన జంటకు ఆశీర్వాదాలు అందించారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తన కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి వేడుకలో సందడి చేశారు. కాగా, నితిన్ నిశ్చితార్థం చేసుకున్న శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ – స్వరూప దంపతులు. నార్నే నితిన్, శివానీల నిశ్చితార్థం ఘనంగా జరిగిన తర్వాత, వీరి పెళ్లి ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వీరి వివాహ ముహూర్తం అక్టోబర్ 10న ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పనులు ఇప్పటికే మొదలైనట్లు సమాచారం. హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుంది.