శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్‌గా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిని నియమించింది కూటమి ప్రభుత్వం.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఓ ధర్నాలో కార్యక్రమంలో పాల్గొన్న సాయిని.. అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ చెంప దెబ్బలు కొట్టి.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు.. సాయిని కొట్టిన వీడియోలు అప్పట్లో వైరల్‌గా మారాయి.
పాకాల మండల పరిధిలో ఉన్న అటవీప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. అటవీప్రాంతంలో డెడ్ బాడీలు దొరకడంతో వారిని ఎందుకు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు విషయమై పాకాల పోలీసులు తంజావూరు పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికి ఒక మహిళ, పురుషుడి డెడ్ బాడలకు పోస్టుమార్టం చేయగా.. వారి నోటిలో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా తెలిసిందని పోలీసులు తెలిపారు. వారిలో మృతుడు తంజావూర్ కు చెందిన కలై…
రాష్ట్ర ప్రజలకు జీఎస్టీ అర్ధం కావాలంటూ.. అందరికీ అర్థమయ్యే రీతిలో అసెంబ్లీలో ప్రసంగించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జీఎస్టీ ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో కమర్షియల్ టాక్స్ చూశాను.. తర్వాత వ్యాట్ వచ్చింది.. వేరే రాష్ట్రంలో నుంచి వస్తువులు వస్తే ఎంట్రీ టాక్స్ ఉండేది.. టాక్స్ అనేది కాంప్లికేటెడ్ అయిపోయిందన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు జీఎస్టీ ప్రవేశ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు మోడీ ప్రధానిగా జీఎస్టీ అమలు చేస్తున్నారన్నారు.. అయితే,…
జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రగతికి మార్గం వేస్తాయి అని వ్యాఖ్యానించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సంస్కరణలను ముందుండి నడిపిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కృషి అభినందనీయం అంటూ ప్రశంసలు గుప్పించారు.. రాష్ట్ర ఆదాయానికి నష్టం కలిగినా.. సామాజిక ప్రయోజనాల కోసం సమర్థించామని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమైన పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలపై చర్చించారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని వారికి లేదు.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వినాలన్న ఆలోచన వారికి లేదన్న జగన్.. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు. కానీ, మేం అలా చేయలేదు. కానీ,…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీ కి ఇస్తూ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.. లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది సిట్.. అయితే, సిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. మిథున్‌రెడ్డిని రెండు…
ఏపీ శాసన మండలి సమావేశాలు మొదటి రోజే వాడివేడిగా జరిగాయి. మండలి మొదటి రోజు వాయిదాల పర్వం కొనసాగింది. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చకు వైసీపీ పట్టు పట్టింది.. రైతు సమస్యలపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన తో సభ మొదటి సారి వాయిదా పడింది. మరోవైపు తిరుపతిలో జరుగుతున్న వరుస సంఘటనల పైనా సభలో హాట్ హాట్ గా చర్చ జరిగింది. తిరుమల సంఘటనలపై మంత్రి ఆనం తీరుకి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. అసలు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఏముందో ఒకసారి చూడాలని హితువు పలికారు.. అయితే, తాడిపత్రికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చిన సమయంలో తాము ఏం అనలేదనే విషయాన్ని గుర్తుచేశారు జేసీ..
"చంద్రబాబు గారూ.. మీకు అధికారం ఇచ్చింది పేదలపై కత్తికట్టడానికా? వారి సొంతింటి కలలను నాశనం చేయడానికా? మీది పేదలకు ఏదైనా ఇచ్చే ప్రభుత్వం కాదని, వారికి అందుతున్నవాటిని తీసివేసే రద్దుల ప్రభుత్వం అని, మీరు పేదల వ్యతిరేకి అని మరోసారి నిరూపణ అయ్యింది. పేద అక్కచెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసిమరీ ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? వాళ్లు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి, మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అక్కచెల్లెమ్మల…