మెడికల్ కాలేజీలవ్యవహారంపై ఆందోళనకు పిలుపునిచ్చింది వైసీపీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు ధర్నా చేశారు.. మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సహా వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు.. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నూతన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చలో మెడికల్ కాలేజీ కు పిలుపు ఇచ్చిన వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు.
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45కి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. గురువారం నుంచి ఏపీ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనుంది కేబినెట్.. మొత్తం 15 అంశాలు ఎజెండాగా ఈ రోజు కేబినెట్ భేటీ జరగనుంది..
Off The Record: సి.రామచంద్రయ్య…. సీనియర్ పొలిటీషియన్. ఒకప్పుడు వైసీపీలో కీలకంగా ఉన్నారు ఈ ఎమ్మెల్సీ. అయితే… గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ మీదే నిప్పులు చెరిగి… మెల్లిగా టీడీపీకి దగ్గరయ్యారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు సీఆర్. కూటమి సర్కార్ కూడా వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసింది. తాను రాజీనామా చేసిన పదవికే నోటిఫికేషన్ రావడంతో… మరో ఆలోచన లేకుండా ఈ…
కోనసీమ జిల్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు జనసేన లీడర్స్ని కంగారు పెడుతున్నాయట. ముఖ్యంగా తమ అధినాయకుడి ఫ్యాన్స్ వ్యవహారశైలి గ్లాస్ లీడర్స్ని గందరగోళంలో పడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళ తీరు ఇలాగే ఉంటే... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పార్టీ ఇరుకున పడటం ఖాయమన్న చర్చ కూడా జరుగుతోంది జనసేన వర్గాల్లో.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన, ఇంకోవైపు బీజేపీ నేతలను బ్యాలెన్స్ చేసే విధంగా వివిధ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ వచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మూడు పార్టీలకు న్యాయం చేసే విధంగా ఈ నియామకాలు చేపడుతూ వచ్చారు.. ఇక ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించింది కూటమి ప్రభుత్వం..