YS Avinash Reddy: నకిలీ మద్యం వ్యవహారంపై కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. నారావారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో ఇట్టే అర్థమయిపోతోందని మండిపడ్డారు… రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో నకిలీ మద్యం కంపెనీలను ఏర్పాటు చేసి.. నారావారి ఎన్ బ్రాండ్ తో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారన్న ఆయన.. మొలకలచెరువులో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి నకిలీ మద్యం సీజ్ చేశారని.. దీంతో టీడీపీ అడ్డంగా బుక్ అయిపోయిందన్నారు… మొలకలచెరువులో తయారు చేస్తున్న మద్యాన్ని రాయలసీమకు మల్లిస్తూ కృష్ణా జిల్లాలో తయారు చేస్తున్న నకిలీ మద్యాన్ని కోస్తాంధ్రకు తరలిస్తూ.. కోట్ల దండుకున్నారని.. ఇప్పటి వరకు 5,280 కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు జరిగాయని అన్నారు..
Read Also: Pakistan: పాక్ ఆర్మీ లక్ష్యంగా బాంబు దాడులు.. బలూచిస్థాన్ వెళ్తున్న రైలుపై దాడి
ఇక, రాష్ట్రవ్యాప్తంగా 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల కేసులు అమ్ముడయ్యాయి అన్నారు అవినాష్ రెడ్డి.. ఏడాది కాలంలోనే ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ద లేకుండా నకిలీ మద్యం అమ్మకాలు చేస్తున్నారు.. 5280 కోట్ల కుంభకోణానికి తెర లేపి, ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయినా.. ఈ ప్రభుత్వంకు చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు.. ఇలాంటి ప్రభుత్వానికా మనం ఓటు వేశామని ప్రజలు భాధపడుతు, పచ్చాత్తాపపడుతున్పారని తెలిపారు.. నారావారి ఎన్ బ్రాండ్ సారాను అమ్మడం అంటే ప్రజల బలహీనత సొమ్ము చేసుకొని దెబ్బకొట్టారని ఆరోపించారు.. చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ తప్పు కప్పిపుచ్చుకోలేనిదిని, దీనికి భవిష్యత్తులో భారీ మూల్యం చల్లించుకోక తప్పదని జోస్యం చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నకిలీ మద్యంతో సంబంధం లేదని తయారీదారుడు విడుదల చేసిన వీడియో చూస్తే ఇంకా అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. నిందితులను తప్పించడానికి అగ్ర నాయకత్వం కృషి చేస్తుందని ఆరోపించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి..