విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.
తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ నేటి ఉదయం ఆంధ్రప్రధేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబుతో ఆయన మర్యాద పూర్వకంగా సమావేశం అయ్యారు. ఇప్పటికీ పెండింగులోనే ఉన్న కొన్ని విభజన సమస్యలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం.
పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి కుడి కాలువ నుంచి సాగు నీరును గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటుగా కురుపాం, పాలకొండ ఎమ్మెల్యేలు జగదీశ్వరి, జయకృష్ణ పాల్గొన్నారు.
Kakani Govardhan Reddy: నెల్లూరు జిల్లాలోని పొడలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అనుభవమున్న.. చంద్రబాబుగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు
రాజమండ్రిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి కమలం పార్టీలో చేరుతున్నారన్న ప్రతిపాదన గాని ఆలోచన గాని లేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరినట్లు తెలిసింది.