Margani Bharat: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఎన్నికల ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం అర్ధరాత్రి తగలబెట్టారు.
నేడు కొండగట్టు అంజన్నను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఉదయం హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇలవేల్పు కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు.
రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ఆయన మొక్కులు చెల్లించుకోనున్నారు.