గత పది రోజులుగా పీడీఎస్ రైస్ ఎక్కువ మూమెంట్ అవుతుందని ఎందుకు రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జేసీ రంగంలోకి దిగాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాం సుందర్ రెడ్డిపై మంత్రి సీరియస్ అయ్యారు.
Chandrababu: నేటి నుంచి ప్రభుత్వంలోని అన్ని శాఖలపై ఆంధ్రప్రదేశ్ నూతన సీఎంగా చంద్రబాబు నాయుడు సమీక్షలు చేయనున్నారు. అందులో భాగంగానే.. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై తొలి సమీక్ష చేయనున్నారు.
నంద్యాల జిల్లాలో గత మూడు నెలలుగా సంచరిస్తున్న చిరుత పులి కోసం ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా గాలించారు. పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. అయితే, నిన్న రాత్రి పచ్చర్ల సమీపంలో బోనులో చిరుత చిక్కుకుంది.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కోర్టుకు హాజరు పరుస్తున్న సమయంలో తెలుగు యువత జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి దాడి చేసిన అంశంపై ఐపీసీ సెక్షన్ 323 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది.