MLA Chirri Balaraju: గిఫ్ట్‌గా ఇచ్చిన కారును వెనక్కి పంపిన జనసేన ఎమ్మెల్యే..
- పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కారును గిఫ్ట్ గా ఇచ్చిన జనసైనికులు..
- గిఫ్ట్‌గా ఇచ్చిన కారును తిరిగి వెనక్కి పంపిన ఎమ్మెల్యే బాలరాజు..
- తనపై అభిమానం చూపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే..
- విలువలతో కూడిన రాజకీయాలు చేసే విషయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తా..
- అందుకే కారు వెనక్కి ఇస్తున్నానని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Chirri Balaraju: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోలవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చిర్రి బాలరాజుకు జనసేన కార్యకర్తలు ఎంతో ఇష్టంతో ఓ కారును కొనిచ్చారు.. రెండు రోజుల క్రితం ఆయనకు జనసైనికులు కారును బహుకరించారు.. అయితే, గిఫ్ట్‌గా ఇచ్చిన కారును తిరిగి వెనక్కి ఇచ్చేశారు ఎమ్మెల్యే.. డౌన్ పేమెంట్ తో టయోటా ఫార్చునర్ కారు కొన్న జనసైనికులు.. మంగళవారం రోజు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గిఫ్టుగా అందించారు. దీనికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే.. తనపై అభిమానం చూపించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే విషయంలో తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను అనుసరిస్తానని.. అందుకే కారు వెనక్కి చేస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఏడేళ్లుగా పోలవరం నియోజకవర్గ సమస్యలపై పోరాడుతున్నానని.. ఇదే తరహాలో ఎమ్మెల్యేగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
- Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
- Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
కాగా, ఒక సామాన్య చిన్నకారు గిరిజన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి అయిన చిర్రి బాలరాజు.. నియోజకవర్గంలోని గ్రామాల్లో తిరగాలన్నా.. అసెంబ్లీకి వెళ్లాలన్న.. ఇతర సమావేశాలు, సమీక్షలు, మీటింగ్‌లకు వెళ్లాలన్నా.. ఇబ్బందిగా ఉందని గుర్తించిన జనసైనికులు.. తమ నేత కోసం అంతా చందాలు వేసుకున్నారు.. కరాటం రాంబాబు కుటుంబ సభ్యులతో పాటు.. బుట్టాయగూడెం గ్రామ జనసైనికులు కొంత నగదు సేకరించారు.. ఆ మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి.. టయోటా ఫార్చ్యూనర్ కారు బుక్ చేశారు.. ఆ కారును ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు గిఫ్ట్‌గా అందించారు.. మిగతా మొత్తాన్ని ఎమ్మెల్యేకు నెలవారి వచ్చే జీతంలో వాయిదా పద్ధతిలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు అభిమానులు.. మొత్తంగా తమ ఎమ్మెల్యేకు ఫార్చునర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కానీ, వారి అభిమానానికి కృతజ్ఞతలు చెబుతూనే.. సున్నితంగా ఆ కారును వెనక్కి పంపించారు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..