ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్తున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు.
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం చల్లబడడమే కాకుండా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. తాజాగా వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది.