Kidney Racket Scam: కలకలం రేపుతోన్న కిడ్నీ మాఫియా.. మూలాలపై పోలీసుల ఫోకస్
- గుంటూరులో కిడ్నీ మాఫియా చేతిలో మోసపోయిన మధుబాబు..
- ఫోకస్ పెట్టిన గుంటూరు
- బెజవాడ పోలీసులు..
- గతంలో కూడా కిడ్నీ అమ్మకాలకు సంబంధించిన మధ్యవర్తుల వ్యవహారంపై భవానీపురం పోలీసులు రెండు కేసులు..
- మళ్ళీ బెజవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు..
- గుంటూరులో బయటపడటంతో బెజవాడ పోలీసులు అప్రమత్తయ్యారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kidney Racket Scam: గుంటూరులో కిడ్నీ మాఫియా చేతిలో మోసపోయిన మధుబాబు వ్యవహారంపై బెజవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. కేసు గుంటూరు పోలీసులు నమోదు చేసినప్పటికీ వ్యవహారం అంతా బెజవాడ కేంద్రంగా జరగటంతో పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. గతంలో కూడా కిడ్నీ అమ్మకాలకు సంబంధించిన మధ్యవర్తుల వ్యవహారంపై భవానీపురం పోలీసులు రెండు కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో తహసిల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మధ్యవర్తులను అరెస్టు చేశారు. ఇక ఆ తర్వాత స్వర ఆసుపత్రిలో కిడ్నీ అమ్మకానికి సంబంధించిన ఘటన కూడా కలకలం రేపింది. ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ బెజవాడ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కార్యకలాపాలు గుంటూరులో బయటపడటంతో బెజవాడ పోలీసులు అప్రమత్తయ్యారు.
Read Also: AP Crime: కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య.. అసలు విషయం తెలిస్తే షాకే..
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
గుంటూరుకు చెందిన మధుబాబు కిడ్నీని కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన గార్లపాటి వెంకటస్వామికి గత నెల జూన్ లో విజయవాడ విజయా ఆసుపత్రిలో ఆపరేషన్ ద్వారా మార్పిడి చేశారు. వీరిద్దరు బంధువులు అంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలను సృష్టించి వాటి సాయంతో కిడ్నీ మార్పిడి చేయించారు. మధ్య వర్తులుగా ఖాదర్ బాషా, వెంకట్ లు వ్యవహరించినట్టు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇద్దరి వ్యవహారాల గురించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఖాదర్ ఇప్పటికే పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వెంకట్ ఆచూకీ తెలుసుకుని విచారణ చేయనున్నారు. కిడ్నీమార్పిడి వ్యవహారంలో ఈ ఇద్దరికీ 3 లక్షల రూపాయల వరకు ఇచ్చినట్టు ప్రాధమిక విచారణలో పోలీసులు గుర్తించినట్టు సమాచారం. దీంతో గతంలో ఈ ఇద్దరి వ్యవహారాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు.
Read Also: Sikhs For Justice: ఖలిస్తానీ ఉగ్రసంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’’పై మరో 5 ఏళ్లు బ్యాన్..
ఆపరేషన్ చేసిన విజయా ఆసుపత్రిపై గతంలో వచ్చిన ఫిర్యాదులను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు. నగరంలో అనేక మంది కిడ్నీ మాఫియా రాకెట్ లో మధ్యవర్తులగా వ్యవహరిస్తూ ప్రధాన ఆసుపత్రులకు ఏజంట్లుగా ఉండి కిడ్నీలను మార్కెటింగ్ చేస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. విజయా ఆసుపత్రి, డాక్టర్ శరత్ పై కూడా బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎడమ కిడ్నీ ఇస్తానంటే కుడి కిడ్నీ తొలగించారని, 30 లక్షలు ఇస్తానని మోసం చేసినట్టు ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నీ తీసుకున్న వెంకటస్వామిని కూడా పోలీసులు విచారణ జరిపి ఆర్థిక లావాదేవీలపై నివేదిక సిద్ధం చేయనన్నట్టు తెలిసింది. కిడ్నీ మాఫియా ఏజంట్లుకు అండగా ఉంటున్న ఆసుపత్రుల వివరాలను కూడా తీసేందుకు పోలీసులు సిద్ధమయ్యారని సమాచారం. కిడ్నీ మాఫియా విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో గుంటూరు, విజయవాడ పోలీసులు సమన్వయంతో కేసు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
-
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
-
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
ట్రెండింగ్
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!