Rs 200 and Rs 500 Notes: పెద్ద నోట్ల రద్దు తర్వాత.. ఏ కరెన్సీ శాశ్వతం కాదు.. ఏ నోటు.. ఎప్పుడైనా రద్దు కావొచ్చు అనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. సీఎం అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది.. 5 ప్రధాన అంశాలపై మెరుగైన ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకర్లతో సబ్ కమిటీ ఏర్పాటుకు ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది.. వ్యవసాయంలో సాగు ఖర్చులు తగ్గించడంపై బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.. కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలని.. మెరుగైన పంటల బీమాను అందుబాటులోకి తేవాలని.. సూపర్ సిక్స్‌లో పీ-4 గురించి ఈ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.. అంతే కాదు.. రూ.200, రూ.500 నోట్లను రద్దు చేయని బ్యాంకర్లకు చెప్పానని.. అంతా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలని.. రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని సూచించారు.. విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రూ.200, రూ.500 నోట్ల రద్దు విషయాన్ని ప్రస్తావించారు సీఎం చంద్రబాబు.
Read Also: Russia: సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన ప్రధాని మోడీ
ఇక, రాష్ట్రంలోని వేర్వేరు అంశాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఏ అంశాలు ఎలా ధ్వంసం అయ్యయో తవ్వే కొద్ది వెలుగు చూస్తున్నాయి.. అన్ని శాఖల్లో నూ ఇదే పరిస్థితి ఉంది.. అందుకే రాష్ట్రానికి బాధ్యతాయుతమైన నాయకుడు ఉండాలి దీనిపై ఆలోచించమని ప్రజలకు చెబుతున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. రాష్ట్ర భవిష్యత్ ను దారుణం గా దెబ్బ తీశారు.. మెరుగైన పాలన ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది.. విద్యుత్ ఎప్పుడూ అభివృద్ధికి సూచికే.. 1995 – 2004 లో మొదటి విద్యుత్ సంస్కరణలు తెచ్చాం.. 2019-24 లో మధ్య గత ప్రభుత్వ హాయంలో 1,29 లక్షల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలు పై తెచ్చారు.. 2019-24 మధ్య విద్యుత్ టారిఫ్ కూడా పెరిగింది. ప్రజల పై భారం మోపారు.. విద్యుత్ సంస్థలు నష్టం చూశాయని ఆవేదన వ్యక్తిం చేశారు.. విద్యుత్ సంస్కరణ ల వల్ల అప్పట్లో మా ప్రభుత్వం ఓడి పోయినా విద్యుత్ సంస్కరణ లు గెలిచాయి.. ఏపీకి విద్యుత్ మిగులు కూడా వచ్చింది.. 2014 నుంచి లో విద్యుత్ ఉత్పత్తి 9453 మెగా వాట్ల మేర పెంచాం.. తలసరి వినియోగం ఏపీ లో 1234 యూనిట్ లకు పెరిగింది.. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రం గా ఏపీ ఎదిగిందన్నారు. మొత్తం గా 2018-19 నాటికి 14,929 మెగా వాట్లల ఉత్పత్తికి చేరేలా కృషి చేశామని గుర్తుచేసుకున్నారు చంద్రబాబు.
Read Also: Encounter: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్‌కౌంటర్.. కథువా ఉగ్రదాడి తర్వాత ఘటన..
2019 -24 మధ్య గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల పై 32,166 కోట్ల మేర భారం మోపారు.. అలాగే విద్యుత్ సంస్థలు పై 49,596 కోట్ల మేర అప్పులు తెచ్చారని విమర్శించారు చంద్రబాబు.. పాలనా పరమైన కారణాల వల్ల విద్యుత్ రంగం ఎదుర్కొన్న నష్టాల విలువ 47, 741 కోట్ల రూపాయలుగా ఉంది.. మొత్తంగా ప్రజల పైనా, ప్రభుత్వానికి జరిగిన నష్టం 1.29,503 కోట్లు రూపాయలు.. అసమర్థ పాలన వల్ల రాష్ట్రానికి, ప్రజలకు జరిగిన నష్టం ఇది.. గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో పెట్టుబడులు కూడా రాకుండా పోయాయి.. సౌర విద్యుత్ పీపీఏ లను రద్దు చేస్తూ తీసుకున్న అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం నష్ట పోయింది. కొన్ని సార్లు ఉత్పత్తి నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల పై భారం మోపాయన్నారు. ట్రూ అప్, ఇంధన సర్చార్జి, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అని రకరకాల గా గత ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిందన్నారు.. జగన్ అహంకారం వల్ల ఒక్క పోలవరం ప్రాజెక్టు లోనే 4773 కోట్ల రూపాయలు మేర ప్రభుత్వం పై అదనపు భారం.. ఇలాగే 25 ఏళ్లు చెల్లింపులు చేస్తే 62 వేల కోట్ల రూపాయల మేర భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. గత ప్రభుత్వం చేతగాని తనం వల్ల ఊహించని కోణాల్లో ను విద్యుత్ సంస్థలు కు నష్టాలు వస్తున్నాయి.. ఏపీ బెవేరేజస్ కార్పొరేషన్ బాండ్లు లోనూ ఏపీ జెన్ కో , ట్రాన్స్ కో లు పెట్టుబడులు పెట్టాయి అంటే జగన్ ప్రభుత్వం ఎలాంటి దుష్ట ఆలోచనలు చేసిందో అర్థం అవుతోందని మండిపడ్డారు.