ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందించారు. ఇవాళ సాయంత్రం గవర్నరును కలిసి రాజీనామా సమర్పించారు. ఈ క్రమంలో.. గవర్నర్ సవాంగ్ రాజీనామాను ఆమోదించారు. కాగా.. వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారని సవాంగ్ పై ఆరోపణలు వచ్చాయి. సవాంగ్ వైసీపీ హయాంలో డీజీపీగా పని చేశారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించారు. అయితే.. సవాంగ్ పదవీ విరమణకు ఇంకా రెండేళ్ల సమయం…
వైసీపీ హయాంలో కేంద్రం నుంచి ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారులకు కేంద్రం ఝలక్ ఇస్తుంది. ఏపీ ప్రభుత్వ ఆమోదం లేకుండా మాతృ శాఖల్లో చేరడానికి వచ్చే అధికారులకు నో ఎంట్రీ బోర్డు పెడుతుంది. కేంద్ర సర్వీసుల నుంచి డెప్యూటేషన్ మీద వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.