CM Revanth Reddy: రాష్ట్ర విభజన అంశాలపై చర్చించుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు.
AyyannaPatrudu: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుని ఏపీ స్పీకర్ అయ్యన పాత్రుడు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో 80 మంది వరకు కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. వీరందరూ సభా మర్యాదలు ఎలా పాటించాలన్న దానిపై తరగతులు నిర్వహిస్తాం.. అసెంబ్లీలో సీనియర్ నాయకుల సభలో మాట్లాడిన స్పీచులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా కలెకర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేశారు.
Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరం ప్రాజెక్టుకు శాపంగా మారింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమను వట్టిసీమగా జగన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.. ఇప్పుడు అదే పట్టిసీమ కృష్ణా డెల్టాకు బంగారు సీమగా మారింది.
రాష్ట్రంలో కొత్త ఇసుక పాలసీపై ఏపీ సీఎం సంకేతాలు ఇచ్చారు. టీడీపీ హయాంలోని ఇసుక పాలసీకి.. జగన్ ప్రభుత్వ ఇసుక పాలసీకి తేడాను అధికారులు వివరించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు.
AP CM: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ( బుధవారం) ఢిల్లీ పర్యటన ఖరారైంది. ముఖ్యమంత్రి హోదాలో హస్తిన పర్యటనకు వెళ్తు్న్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసే ఛాన్స్ ఉంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉన్న బిల్లులపై ఆర్థిక శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. పెండింగ్ బిల్లులపై వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలకు ఆర్థిక శాఖ లేఖలు రాసింది.
AP Deputy CM: గత ప్రభుత్వము అడ్డగోలుగా నిధులు తీసుకుని పంచాయతీలకి ఇవ్వలేదు.. నిధుల కొరత ఉంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సిబ్బంది కొరత ఉంది.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ అభివృద్ధి చేయలేదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారు..
విశాఖ సెంట్రల్ జైలును ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. గంజాయి కేసులో జైలులో ఉన్న గంజాయి ఖైదీలను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సెంట్రల్ జైల్లో సిబ్బందికి కనీస వసతలు లేవు.. చిన్న, చిన్న పిల్లలు గంజాయి కేసుల్లో ఖైదీలగా ఉన్నారు.