మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళ గల్లంతు అయ్యింది.. ఫుట్ పాత్‌పై అందరిలాగే సదరు మహిళ నడుకుంటూ వెళ్తుండగా.. ఒక్కసారిగా ఫుట్‌పాత్ కుంగిపోయింది.. దీంతో.. ఆమె మురికికాలువలో పడి గల్లంతైంది.
నెల్లూరులోని కేంద్ర కారాగారం నుంచి పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదలయ్యారు. వివిధ కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.. ఈ ఉత్తర్వుల కాపీని ఈరోజు ఉదయం ఆయన న్యాయవాదులు కేంద్ర కారాగారంలో అందజేశారు. దీంతో అధికారులు ఆయనను విడుదల చేశారు.
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.. గంగవరం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది.. ఈ ఘటనలో భార్య, భర్తలు ఇద్దరూ మృతిచెందారు.. తీవ్రగాయాలపాలైన కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఈ ప్రమాదంలో బాణాసంచా తయారీ కేంద్రం యజమాని ఖాదర్ భాషాతో పాటు ఆయన భార్య షాహినా ప్రాణాలు విడిచారు..
తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ బాలికల పరిశీలన గృహం(జువైనల్ హోమ్) లో ఉండే బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి నగరంలో అనాథ బాలికలతో పాటు నేర చరిత్ర ఉన్న బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఉంది. ఈ వసతి గృహంలో ఉండే బాలికలు వివిధ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ…
నవంబర్ కోటాకు సంబంధించిన వివిధ టికెట్లను విడుదల చేస్తూ.. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు శుభవార్త చెబుతూ వస్తున్న టీటీడీ.. ఈ రోజు ఆన్లైన్లో నవంబర్ నెల దర్శన టికెట్లు విడుదల చేయబోతోంది.. ఈ రోజు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.. ఇక, మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. తిరుమల, తిరుపతిలో నవంబరు నెల గదుల కోటాను ఆన్లైన్లో…
Home Minister Anitha: విశాఖలోని గాజువాక వడ్లపూడి పవన్ సాయి ఆస్పత్రిలో అచ్యుతాపురం సెజ్ బాధితులకు చెక్కులు అందజేశారు హోం శాఖ మంత్రి అనిత. బాధితులకు పూర్తిగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారికి కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షల రూపాయలు అందజేశామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులుకు అండగా నిలబడ్డామన్నారు. ఆస్పత్రిలో సీఎం చంద్రబాబు బాధితుల కుటుంబాలతో మాట్లాడి వారిని ఓదార్చారని తెలిపారు. అన్ని…
దేశ సేవ చేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భర్త ఆశయం కోసం ఆయన భార్య నడుం బిగించింది. పచ్చని గ్రామాలే ప్రగతికి మెట్టు అన్న ఆయన ఆశయానికి ఆమె పునాది వేసింది. ఆ ఆశ నెరవేర్చడం కోసం ఆమె రాజకీయాలలోకి రంగ ప్రవేశం చేసింది. అయితే జనసేన పార్టీ ఆమెకు అండగా నిలిచింది. ఆమె ఆశయం విన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తనను కదిలించింది అనడం విశేషం..... ఇంతకు ఎవరు ఆ సర్పంచ్...…
కృష్ణా బేసిన్ ఎగువ పరీవాహకంలో వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు పెరిగింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి భారీగా వరద వస్తుండగా.. అంతేస్థాయిలో శ్రీశైలానికి వదులుతున్నారు. రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదనతో శ్రీశైలం నుంచి 69,132 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదిలేస్తున్నారు.