National Sports Day: క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టు..
- జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని టుడే నేషనల్ స్పోర్ట్స్ డే ర్యాలీ..
- పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. పీవీ సింధు..
- క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయన్న మంత్రి..
- ప్రతి ఓటమి గెలుపునకు మెట్టు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న సింధు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Sports Day: క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని “టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” ర్యాలీని ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన వేడుకల్లో మాట్లాడుతూ.. దేశంలో యువతకు కొదవ లేదు ఎన్నో విజయాలు సాధించగలరు అన్నారు.. క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులు వెలుగులోకి వచ్చారని పేర్కొన్నారు.. క్రీడల విషయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు.. స్టేడియాల అభివృద్ధికి, కొత్త స్టేడియాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
Read Also: Bill Payments: ఆర్థిక శాఖలో బిల్లుల చెల్లింపుల ప్రకంపనలు.. మంత్రి ఆమోదం లేకుండానే..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీవీ సింధు మాట్లాడుతూ.. ప్రతి ఓటమి గెలుపునకు మెట్టుగా అభివర్ణించారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారన్న ఆమె.. భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.. ప్రతి ఒక్కరూ ఓటమికి కుంగిపోకుండా ఓటమిని మెట్టుగా చేసుకొని విజయ శిఖరాలు అవరోధించాలన్నారు.. కష్టపడితే తప్పకుండా ఉన్నత స్థాయికి చేరుకుంటారు.. ప్రతి ఒక్కరు క్రీడలు అలవాటు చేసుకోవాలన్నారు పీవీ సింధు. మరోవైపు మరో నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. జాతీయ క్రీడ దినోత్సవం సందర్భంగా పేద క్రీడాకారులకు సహాయార్థం విరాళం ప్రకటించారు.. ఇదివరకే రాజధాని నిర్మాణానికి మొదటి నెల జీతం అందజేసిన విషయం విదితమే..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?