Nimmala Rama Naidu: ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలకు తృటిలో ప్రమాదం తప్పింది. ఏలూరు జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశానికి మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లా పరిషత్ ప్రాంగణంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న సమయంలో స్టేజీ ఒక్కసారిగా కుంగింది. ఆ స్టేజీని కర్రలతో కట్టారు. ఆ సమయంలో స్టేజీపై ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. స్టేజీ పూర్తిగా పడిపోకుండా అక్కడ ఉన్న కార్మికులు అడ్డుకోవడంతో అధికారులు, పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
Read ALso: Vana Mahotsavam: వన మహోత్సవం.. మొక్కలు నాటి ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం..