మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నామని మంత్రి నారాయణ తెలిపారు. మిగిలిన అన్న క్యాంటీన్లను అక్టోబర్లో ఏర్పాటు చేస్తామన్నారు.
దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. సీఎం చంద్రబాబుతో కలయికలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగినట్టు సమాచారం. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు చోటు కల్పించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టు తెలిసింది.
YS Jagan: ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి ప్రభుత్వం ఉరితాడు బిగిస్తోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే స్పెషలిస్టు వైద్యుల సహా సిబ్బంది నియామకాల్ని ఆపడంతో జీరో వేకెన్సీ పాలసీకి గండి కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటుకు సర్వే ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో 7ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లి గూడెం, నాగార్జున సాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలలో వీటి ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. 39వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ మంగళవారం బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) సమక్షంలో గాయత్రి నగర్లోని పురంధేశ్వరి నివాసంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈనెల 29న బంగారు స్వర్ణరథోత్సవం నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించింది. దేవస్థానం వైదిక కమిటీ సూచనతో ప్రతీ మాసంలో శ్రీస్వామి అమ్మవార్ల స్వర్ణరథోత్సవం నిర్వహిస్తున్నారు.