CM Chandrababu: మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి మానవత్వం చాటుకున్నారు. తమ నాయకుడితో ఫోటో దిగాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ అభిమాని కోరికను తీర్చారు చంద్రబాబు. అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని వైద్య ఖర్చులకు ఐదు లక్షల ఆర్థిక సాయం కూడా ఆయన అందించారు.
Student suicide: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్వీ ఆర్కే కళాశాల ప్రిన్సిపల్ మురళీ వేధింపులతో ఇంటర్మీడియట్ విద్యార్థి చెల్లుబోయిన అచ్యుత్ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు.
Kesineni Chinni: కృష్ణాజిల్లా జిల్లాలోని గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్పోర్ట్ప్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఏఏసీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏఏసీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్ తో పాటు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇటీవల నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్లలో ఆకర్షణీయమైన ఆఫర్లతో భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక రూపాయి, రెండు రూపాయలకే బిర్యానీ అందిస్తూ రెస్టారెంట్లు ముందుగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో నూతనంగా ప్రారంభమైన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు కళ్లు చెదిరిపోయే బంపర్ ఆఫర్ పెట్టాడు.