AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై ఎలాంటి చర్చ చేపట్టకుండానే వాయిదా పడింది.. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యింది.. ప్రముఖ పారిశ్రామికవేత్త.. వ్యాపార దిగ్గజం.. రతన్ టాటా మృతికి సంతాపం ప్రకటించింది ఏపీ మంత్రివర్గం.. ఇక, కేబినెట్ సమావేశానికి ముందుగానే రతన్ టాటా చిత్ర పటానికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు.. అయితే, అజెండా అంశాలపై చర్చ వాయిదా వేసింది మంత్రవర్గం.. దీంతో.. కేబినెట్ సమావేశం ముగిసింది.. మరోవైపు.. కాసేపట్లో ముంబై బయల్దేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. రతన్ టాటా భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులర్పించనున్నారు..
Read Also: Vehicles Smuggling: నేషనల్ హైవేపై వాహనాల అక్రమ రవాణా.. విదేశాలకు ఎగుమతి
కాగా, నేటి కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ సాగుతుందని భావించారు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్‌కు సంబంధించి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల మినహాయింపు ప్రతిపాదనపై.. చెత్త పన్ను రద్దు ప్రతిపాదనపై.. 13 కొత్త మున్సిపాలిటీల్లో 190 కొత్త పోస్టుల భర్తీ ప్రతిపాదనపై.. రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ విషయమై ప్రతిపాదన సహా పలు ఇతర అంశాలపై చర్చ సాగుతుందని భావించారు.. కానీ, రతన్ టాటా మృతితో కేబినెట్ సమావేశం అజెండాపై చర్చను వాయిదా వేశారు..