నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ భేటీ కానుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ ఉపముఖ్యమంత్రిని కోరనుంది.
పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్‌కి పంపాలంటే భయమేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా అంటూ ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మాత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి సింహవాహనంపై మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఇదిలా ఉండగా.. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ ఇవాళ 4వ రోజు శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు.
Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 30కి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ ఎప్పుడూ జరగలేదని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక భేటీకి పిలుపునిచ్చారు.
Minister Narayana: నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ పిల్లర్లకు అంటించిన పోస్టర్లను మంత్రి నారాయణ తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పట్టణాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు లేకుండా అందంగా మారుస్తామన్నారు. గతంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం 90 శాతం విజయవంతమైంది అని తెలిపారు.
Vijayawada Durga Prasadam: బెజవాడ కనక దుర్గమ్మ గుడికి వచ్చిన సరుకులను మరోసారి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ) అధికారులు వెనక్కి పంపించారు. 200 బాక్సుల కిస్ మిస్ ను వెనక్కి పంపినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.