Vizag Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కొత్త కోణాలు..
- జాయ్ జేమిమ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణాలు..
- తవ్వే కొద్ది బయటపడుతోన్న కొత్త విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీ ట్రాప్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.. తవ్వే కొద్ది కొత్త విషయాలు బయటపడుతున్నాయి.. హనీ ట్రాప్ కేసు గుట్టు రట్టు అవ్వడంతో ఒక్కొక్కరిగా బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూలు కడుతున్నారు.. తాజాగా మరో కొత్త విషయం బయటకు వచ్చింది.. పోలీసులకే జలక్ ఇచ్చింది మాయ లేడీ జాయ్ జేమియా.. 10 నెలల కిందటే ఈ ఏడాది జనవరిలో వ్యాపారవేత్త బీన్ బోర్డ్ డైరెక్టర్ ఎడ్ల ఐజాక్ జెరేమియను హాని ట్రాప్ చేసి.. రేప్ కేసు పెట్టించింది కిలాడీ లేడీ… పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో దీనిపై FIR నమోదు చేశారు. ఆ సమయంలో జేమియ మోసాలను గుర్తించలేకపోయరు పోలీసులు.. అప్పుడు విచారణ లేకుండానే బాధితుడిపై రేప్ కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి.. ఇప్పుడూ అదే వ్యక్తి హాని ట్రాప్ కు గురయ్యానని ఫిర్యాదు చేశాడు.. ఈ కేసుకి సంబంధించి NTV చేతికి 10 నెలల కిందట నమోదైన FIR కాపీ చిక్కింది.. అప్పటి నిందితుడే ఇప్పడు బాధితుడిగా మారాడు..
Read Also: Pakistan : పాకిస్తాన్‌లోని సింధ్‌లో భయం గుప్పిట్లో హిందువులు..ఎందుకో తెలుసా ?
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
కాగా, విశాఖపట్నంలో వెలుగుచూసిన తాజా ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎన్ఆర్ఐ యువకుడితో పరిచయం పెంచుకుంది. ప్రేమిస్తున్నట్టు మాయమాటలు చెప్పి నిలువునా ముంచేసింది. ఆమె నుంచి తప్పించుకున్న యువకుడు భీమిలి పోలీసులను ఆశ్రయించాడు.. తీగలు లాగితే అసలు డొంకలు కదిలాయి.. షీలానగర్ కు చెందిన ఓ కుటుంబం కొంతకాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్‌స్టా ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమీమా పరిచయం పెంచుకుంది. బాధిత యువకుడి ద్వారా షీలానగర్ లోని వారి చిరునామా తెలుసుకుంది. అతని తల్లిదండ్రులు షీలానగర్‌లో ఉన్నప్పుడు వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిగా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలినని.. పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతని తల్లిదండ్రులు నిరాకరించారు.
Read Also: Allu Arjun : పుష్ప – 2 రిలీజ్ డేట్ మారిందోచ్..?
ఇక, ఆ తర్వాత కాలంలో అమెరికాలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్న బాధిత యువకుడిని మాయ మాటలు చెప్పి విశాఖకు రప్పించింది. ఎయిర్‌పోర్ట్ నుంచే యువకుడిని మురళీనగర్ లోని తన ఇంటికి తీసుకువెళ్లి బంధించింది. మత్తు పదార్థాలు కలిపిన జ్యూస్‌లు.. ఇతర డ్రింక్స్ ఇచ్చి పెర్ఫ్యూమ్ స్ప్రే చేస్తూ మైకంలో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నట్లు ఫొటోలను తీయించింది. వాటితో ఆ యవకుడిని బ్లాక్‌మెయిల్ చేసింది. యువకుడు తన తల్లిదండ్రులకు చెప్పిపెళ్లికి ఒప్పిస్తానన్నా వినిపించుకోకుండా జెమీమా.. తన సహచరులతో కలిసి తరచూ బెదిరించేది. ఈ క్రమంలో ఇటీవల భీమిలిలోని ఒక హోటల్లో బల వంతంగా నిశ్చితార్థం చేసుకుని.. యువకుడితో రూ.5 లక్షల వరకు ఖర్చు చేయించింది. యువకుడి ఫోన్ బ్లాక్ చేసి, నిశ్చితార్థం, వారు దగ్గరగా ఉన్న ఉన్న ఫొటోలు చూపించి.. మురళీనగర్ లోని తన ఇంట్లో మళ్లీ నిర్బంధించింది. తనను పెళ్లి చేసుకోక పోతే ఈ ఫొటోలతో పోలీస్ కేసులు పెట్టించి.. అమెరికా వెళ్లకుండా చేస్తానని అతని వద్ద డబ్బులు కాజేసింది. ఆమె ఇంటి నుంచి అతను ఒకసారి పారిపో యేందుకు ప్రయత్నించగా సహచరులతో కలిసి కత్తితో చంపడానికి ప్రయత్నించింది. ఆమె సహచరులు కూడా జెమీమాను పెళ్లి చేసుకోకపోతే చంపే స్తామని బెదిరింపులకు దిగేవారు. ఎట్టకేలకు ఈ నెల 4వ తేదీన బాధిత యువకుడు ఆమె నుంచి తప్పించుకుని భీమిలి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మురళీనగర్ లో జెమీమాను అదు పులోకి తీసుకుని.. ఆమె నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, మూడు ఫోన్లు, కారు సీజ్ చేశారు. శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గతంలో కూడా జెమీమా, ఆమె స్నేహితులు ధనవంతుల అబ్బాయిలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు బాధిత యువకుడు పోలీసులకు తెలిపాడు. జెమీమా స్నేహితులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. హానీ ట్రాప్ కేసులో కీలక విషయాలు విశాఖ పోలీసు కమీషనర్ తెలిపారు.. ఇక ఈ కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!