YCP vs BJP: జమ్మలమడుగు రాజకీయాలు హిటేక్కాయి. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది… ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యా రోపణలతో విమర్శలు వర్షం కురుస్తోంది. హేమాహేమీ నేతల మధ్య మాటల యుద్ధం ఎటువైపు దారితీస్తుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇరువురు నేతలు తగ్గేదేలే అంటూ ఉండడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి… ఏపీ రాజకీయాలలో జమ్మలమడుగు రాజకీయాలు ఎప్పుడు సంచలనమే. రెండు ఫ్యాక్షన్ కుటుంబాలే. ఎప్పుడు ఎక్కడ ఎలా తలపడతాయో ఎవరికీ తెలియదు. అటువంటి కుటుంబాల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబానికి, దేవగుడి ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి గత 40 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ నడుస్తోంది. ఇప్పుడిప్పుడే ఫ్రాక్షన్ రాజకీయాలు కాస్తంత కుదుటపడ్డాయి, అనుకుంటున్న తరుణంలో మరో మారు హేమహేమేలు మాటల యుద్ధంతో రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
Read Also: Ratan Tata : రతన్ టాటా వారసుడు ఎవరు.. రేసులో ముగ్గురి పేర్లు
జమ్మలమడుగు వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ పోన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి దాడులకు ప్రతి దాడులు తప్పవని చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసాయి. అందుకు దీటుగా బీజేపీ ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణ రెడ్డి ఒకరు వైడ్ బాల్ అయితే , మరొకరు నోబాల్ అని వైసీపీ నేతలపై ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతీకారంగా ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలు చెప్పి ప్రజలకు ఆశ చూపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. గండికోట ముంపు గ్రామాలకు, రాజోలు ముంపు రైతులకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా సిక్స్ కొట్టడానికి ఆదినారాయణ రెడ్డికి బ్యాట్ లేస్తుందా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. హామీలు అమలు చేయడానికి ఐదు సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే తప్ప, సిక్స్ కొట్టలేరని ఆయన అన్నారు.
Read Also: Child Kidnap: సినిమా స్టైల్లో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శిశువు కిడ్నాప్ (వీడియో)
ఇక, వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. దేవగుడి సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళా అనంతరం ఆయన మీడియా ముందు విమర్శల వర్షం కురిపించారు.. తన బ్యాట్ లేవదు అంటూ ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలకు దీటుగా స్పందించారు. ఒక్క సిక్స్ రే కాదు ,తాను అనేక సిక్సర్లు కొడతానని తెలిపారు. తాను క్రికెట్ ఒక్కటే కాకుండా ఫుట్బాల్ కూడా ఆడగలనని అన్నారు. తాను బంతిని తంతే వైకాపా నాయకుల మూతులు పగులుతాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే అడ్డంగా నరుకుతామంటూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.జమ్మలమడుగులో జరిగిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమని ఇరువురు నేతలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.