వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు. గత ఐదేళ్లల్లో వ్యాపారం చేసుకోవాలి అంటే భయం.. తమ కార్యకర్తలతో తాను మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కష్టబడిన కార్యకర్తలకు సంవత్సరానికి రూ. 10 కోట్లు చొప్పున రూ. 50 కోట్లు ఇస్తానని చెప్పాను.. ఇప్పటికే రూ. 2 కోట్లు ఇచ్చానని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: ఇంద్రకీలాద్రికి సీఎం.. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ
గత వైసీపీ ప్రభుత్వంలో ఏ వ్యాపారం చేయాలన్న నెల్లూరు 10 నుంచి 20 శాతం షేర్ ఇవ్వాల్సిందేనని అన్నారు. అందరూ వ్యాపారం చేసుకోవాలి.. రాష్ట్రానికి ఆదాయం పెరగాలనేదే తమ ఉద్దేశ్యం అని మంత్రి నారాయణ తెలిపారు. ఎవ్వరైనా వ్యాపారం చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది.. ఇప్పుడు నెల్లూరు సిటీలో అందరూ ఆనందంగా ఉన్నారు.. 250 కుటుంబాలకు ఆదాయం వచ్చే నిర్ణయాన్ని అడ్డుకొని గతంలో నెల్లూరులో హోటల్ కట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాము వచ్చాక నిమిషాల్లో అనుమతులు ఇచ్చాం.. దీనీ వల్ల ఆదాయం పెరుగుతుంది, ఉపాధి కలుగుతుందని చెప్పారు. నెల్లూరులో నారాయణ ఇలా చేసుకుంటూ పోతే వైసీపీ జీరో అయిపోతుందనే భయం కలుగుతుందని మంత్రి నారాయణ అన్నారు.
Read Also: Haryana Elections: బీజేపీకి పెరిగిన మరింత బలం.. ఇద్దరు ఇండిపెండెంట్లు చేరిక..
మరోవైపు.. తప్పుడు ప్రచారం చేసే జగన్ 11 సీట్లకు పరిమితం అయ్యారని మంత్రి నారాయణ విమర్శించారు. వరదల కోసం రూ. 602 కోట్లు పరిహరం ఇస్తే.. రూ. 5 వేల కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారని అంటారా..? అని దుయ్యబట్టారు. రోజుకు 12 లక్షల ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేశాం.. సీఎం చంద్రబాబు ఫీల్డులో ఉన్నారు.. ప్రజల కష్టాలు చూశారు. జగన్ ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారని తెలిపారు. తాగు నీరుకే కాకుండా ఇతర అవసరాలకు కూడా వాటర్ బాటిళ్లు సప్లై చేశాం.. చంద్రబాబు చేసిన వరద సాయాన్ని ఎవ్వరూ మరిచిపోవడం లేదు.. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా వరద సాయం అందించారన్నారు. జగన్ ఇలాగే మాట్లాడుతూ పోతే పులివెందులలో కూడా ఓడిపోతారని అన్నారు. 11 సీట్లు కూడా పోయి వైసీపీ సున్నానే మిగులుతుంది.. అసలు ఆ స్థాయిలో సాయం అందించవచ్చనే ఆలోచనైనా జగనుకు రాదని పేర్కొన్నారు. రోడ్లు కొట్టించి మరీ నీటిని బయటకు పంపాం.. జగన్ ఇస్తానన్న కోటి రూపాయల సాయం ఏమైంది..? సీఎం రిలీఫ్ ఫండ్ లెక్కల్లో అయితే జగన్ ఇచ్చిన విరాళం లేదని మంత్రి నారాయణ తెలిపారు.