కష్టపడకుండా సులువుగా డబ్బులు సంపాదించాలనే దురాశతో ఎంతో మంది అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పీకల్లోతు చిక్కుల్లో చిక్కుకుని చివరికి ప్రాణాలను తీసుకుంటున్నారు. ఆన్లైన్ వేదికగా వేదికగా ఎందరో ఆన్లైన్ బెట్టింగ్ కాస్తూ, అప్పుల ఊబిలో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు ఓ కుటుంబం బలైంది.
గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు..
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి..
నేడు వైయస్సార్ జిల్లాగా చలామణిలో ఉన్న కడప జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా గెజిట్ మార్పులు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. "రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన…
హోటల్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.. స్విగ్గీని బాయ్ కాట్ చేయాలని హోటల్స్ యాజమాన్యం నిర్ణయించింది.. విజయవాడలో సమావేశమైన హోటల్స్ యాజమాన్యాలు.. స్విగ్గీ వ్యవహారంపై చర్చించారు.. అయితే, నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైనంపై హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు..