ఏపీలో మద్యం షాపులకు మందకోడిగా దాఖలవుతున్నాయి టెండర్లు. ఆరు రోజుల వ్యవధిలో 3,396 షాపులకు గానూ కేవలం 8,274 టెండర్లే దాఖలు అయ్యాయి.. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయంటోంది ఏపీ ఎక్సైజ్ శాఖ. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు వస్తున్నట్టు అంచనావేస్తున్నారు.
బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి.. రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు కనకదుర్గమ్మ.. ఇక, 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.
Amit Shah: నేడు (సోమవారం) కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోవామపక్ష ప్రభావిత రాష్ట్రాలతో సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం కొనసాగనుంది. ఈ మీటింగ్ కు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యంత్రులు, హోంమంత్రులు, సీఎస్‌లు, డీజీపీలు హాజరుకాబోతున్నారు.
రానున్న వేసవి కాలంలో నెలకొనే ఇసుక డిమాండ్‌కు అనుగుణంగా లభ్యత పెంపుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వాణిజ్యపన్నుల శాఖ ఛీఫ్ కమీషనర్, అబ్కారీ, భూగర్భ, గనుల శాఖ ముఖ్య కార్యాదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఉచిత ఇసుక పాలసీ 2024 జులై 8 నుండి అమలులోకి తీసుకురాగా.. స్టాక్‌యార్డ్‌ల వద్ద 4.8 లక్షలు, డి-సిల్టేషన్ పాయింట్లు వద్ద 54 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రస్తుతం సిద్దంగా ఉందన్నారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన నాగరాజా రెడ్డి బెట్టింగ్‌లకు పాల్పడి అధిక మొత్తంలో డబ్బులను పోగొట్టుకున్నాడు. అప్పులు కూడా ఎక్కవయ్యాయి. దీంతో.. అప్పుల బాధ భరించలేక రెండ్రోజుల క్రితం (శుక్రవారం) తన కుటుంబంతో కలిసి ఇంట్లో పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు వారిని చిత్తూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో శుక్రవారం భార్యాభర్తలిద్దరూ మృతి చెందగా.. నిన్న చికిత్స పొందుతూ కుమార్తె సునీత మృతి చెందింది. కొద్దిసేపటి క్రితం చికిత్స పొందుతూ…
సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు రేపు ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 కోట్లు ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల్లో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.
పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసుల ఛేదించారు. అస్ఫియా హత్య కేసును ఛేదించినట్లు హోంమంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. అస్ఫియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన కోట్ల రూపాయల స్కాం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఖాతాదారులు ఆధారాలతో సహా బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని బ్యాంక్ అధికారుల వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.