Vizianagaram Utsav: విజయనగరం జిల్లాలో ఈ నెల 14, 15వ తేదీలల్లో జరిగే పైడితల్లి అమ్మవారి తోల్లేళ్లు, సిరిమానోత్సవం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కేబినెట్ సహచర మంత్రులు అందరినీ ఆహ్వానిస్తూ వారికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతి రాజు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో అధికారికంగా మొట్ట మొదటి సారిగా ఈ ఉత్సవంగా జరుపుతున్నారు.
Read Also: Ajith: అబ్బా ఏమున్నాడు బాసూ..!!
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు తన కేబినెట్ మంత్రులందరూ రావాల్సిందిగా మంత్రి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి కోరారు. ఈరోజు మంత్రులు అందరికి వీరు ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఇక, ఉత్తరాంధ్రలో అతి పెద్ద పండుగైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొని ఆ తల్లి కృపకు పాత్రులు కావాల్సిందిగా వారందరికీ మంత్రి శ్రీనివాస్ తో పాటు, ఎంపీ, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.