YS Jagan: చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం..
- రేపల్లె వైసీపీ ప్రజాప్రతినిధులు.. కార్యకర్తలతో జగన్ భేటీ..
- చంద్రబాబులా మనం అబద్దాలు ఆడలేకపోయాం..
- రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది- వైఎస్ జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రేపల్లె నియోజక వర్గంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపల్లె నియోజకవర్గంలో అనుకోని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.. కష్టాలు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు.. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది, ఇది సృష్టి సహజం.. విలువలు, విశ్వసనీయతే మనకు శ్రీరామ రక్ష.. వ్యక్తిత్వమే మనల్ని ముందుకు నడిస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఐదేళ్ల పాలనా కలంలో గర్వంగా తలెత్తుకునేలా పరిపాలన చేశాం.. నేను వైయస్సార్ సీపీ కార్యకర్తను అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పుకోగలం.. అన్ని పనులు ప్రజలకు చేశాం.. మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేయదగద్ది కాదని, అది అత్యంత పవిత్రమైనదని ప్రపంచానికి మన పార్టీ మాత్రమే చెప్పింది.. ప్రజలకు ఇచ్చిన మాటలను నెరవేర్చామని మాజీ సీఎం జగన్ తెలిపారు.
Read Also: Kerala: జమిలి ఎన్నికలు వద్దంటూ కేరళ అసెంబ్లీ తీర్మానం
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇక, చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయామని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలతో పోటీ పడలేకపోయాం.. ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్పినా.. ఇవాళ ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది.. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లలేని పరిస్థితి.. పిల్లలు రూ.15వేలు గురించి అడుగుతారు.. మహిళలు రూ.18వేలు గురించి అడుగుతారు.. పెద్దవాళ్లు రూ.48 వేల గురించి అడుగుతారు అని ఆయన చెప్పుకొచ్చారు. విద్యా, వైద్యరంగాలను ఈ నాలుగు నెలల కాలంలో నాశనం చేశారు.. వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని ఆయన ఆరోపించారు. డోర్‌డెలివరీ పద్ధతిని తీసేశారు.. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్.. రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది.. ప్రజలను భయపెడుతున్నారు.. తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హద్దుల్లేని అవినీతి జరుగుతోంది.. పేకాట క్లబ్బులు ప్రతినియోజకవర్గంలో నడుస్తున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pat Cummins: ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ సక్సెస్‌కు కారణం పాట్ కమిన్స్!
కాగా, లిక్కర్ సిండికేట్ నడుపుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. విపరీతంగా అమ్మకాలు పెంచడానికి సిద్ధమయ్యారు.. మన హయాంలో ఇసుకమీద ప్రభుత్వానికి డబ్బులు వచ్చేవి.. ఇవాళ ఉచితం లేదుకానీ రెట్టింపుకన్నా, ఎక్కువరేట్లకు అమ్ముతున్నారు.. చంద్రబాబు అబద్ధాలు చెప్పారు.. ప్రజలను అబద్ధాలతో మోసం చేశారు.. ఆ మోసాలకు గురైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు.. అన్నీ చేసిన మనకే ఇలా అయితే, ప్రజలను ఇంతలా మోసంచేసిన చంద్రబాబును ప్రజలు ఏం చేస్తారు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు సింగిల్ డిజిట్‌కూడా ఇవ్వరు.. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలోనే సంక్షేమ క్యాలెండర్‌ను రిలీజ్ చేశామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రతి నెలా క్రమం తప్పకుండా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూర్చం.. ఒక్క వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రమే ఇలా చేయగలిగింది అని జగన్ వెల్లడించారు.
Read Also: S. S. Rajamouli Bday Special : ఓటమి ఎరుగని ధీరునికి ‘ఆస్కార్ సెల్యూట్’
అలాగే, అయినా మనం ఏరోజూ సాకులు చెప్పలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఎన్నికష్టాలున్నా మనమే పడి, ప్రజలకిచ్చిన మాటను తప్పకుండా అమలు చేశాం.. నేరుగా ఆయా కుటుంబాల ఖాతాల్లో వేశాం.. డెలివరీ మెకానిజంలో లంచాలకు తావే లేకుండా చేశామన్నారు. లంచాలు లేకుండా పథకాలు సేవలు అందించిన పరిస్థితి ఒక్క వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే కనిపించింది.. మరోవైపు విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని ఆయన తెలిపారు. కేవలం వేయి చికిత్సలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని 3350 ప్రొసీజర్లకు పెంచామని చెప్పారు. రూ.25 లక్షల వరకూ ఆరోగ్యశ్రీని పరిధిని పెంచాం.. ఆరోగ్య ఆసరా కూడా తీసుకు వచ్చాం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూశాం.. జీఎంపీ ప్రమాణాలున్న మందులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చామని వైఎస్ జగన్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!