కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారి ఆలయంలో నవంబర్ నెలలో ప్రత్యేక ఉత్సవాల సీజన్ గా మారింది. శ్రీవారి ఆలయంలో నిత్యం నిత్యోత్సవాలు, ప్రతి వారం వారోత్సవాలు, ప్రతి మాసం మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ప్రతి సంవత్సరం కన్యామాసం శ్రవణా నక్షత్రంతో వూర్తి అయ్యేలా తొమ్మిది రోజులు పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. తొమ్మిది రోజులు పాటు స్వామివారు 16 వాహనాలపై మాడ వీధులలో విహరిస్తూ భక్తులుకు దర్శనం ఇస్తారు. దీనితో పెద్ద సంఖ్యలో భక్తులు…
నంద్యాల జిల్లాలో పెళ్లి పేరుతో వేధింపులకు గురిచేయడంతో.. మైనర్ బాలిక బలైంది. నందికొట్కూరు ఆర్టీసీ బస్ స్టాండ్ లో వ్యాసమోల్ తాగి బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది బాధితురాలు..
డల్లాస్ లోని పెరోట్ గ్రూప్ అండ్ హిల్వుడ్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తోభేటీ అయ్యారు మంత్రి లోకేష్.. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇన్నోవేటివ్ రియల్ ఎస్టేట్ అండ్ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మీ వినూత్న విధానాలు మా రాష్ట్ర ఆర్థిక వృద్ధి, స్థిరత్వానికి తోడ్పడతాయి. మీ దార్శనిక ప్రాజెక్టులైన అలయన్స్టెక్సాస్ వంటివి ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల వృద్ధి వ్యూహంతో బాగా సరిపోతాయి. అలయన్స్ టెక్సాస్ తరహాలో పారిశ్రామిక, లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి…
అమెరికా పర్యటనలో ఆస్టిన్ లోని టెస్లా కేంద్ర కార్యాలయానాకి వెళ్లారు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో జగజ్జేతగా ఉన్న టెస్లా.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎఫ్ఓ వైభవ్ తనేజా మాట్లాడుతూ... ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్, బ్యాటరీ స్టోరేజిలో తమ సంస్థ గ్లోబల్ లీడర్…
తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు కీలక ప్రకటన చేశారు.. తిరుపతి నగరవాసులకు.. శ్రీవారి భక్తులకు ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు.. బాంబు బెదిరింపులపై ప్రత్యేక సైబర్ టీం, ఐటీ, సహా ఇతర విభాగాలతో దర్యాప్తును వేగంగా చేస్తున్నాం అన్నారు.. నగరంలో భద్రత పెంచాం.. నిరంతరం సీసీటీవీ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి కదలికను మానిటరింగ్ చేస్తున్నాం.. బెదిరింపులు వచ్చిన అన్ని హోటల్లో సహా ఇతర ప్రదేశాలలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాం.. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు తనిఖీల్లో దొరకలేదు…
సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణులకు వైసీపీ కీలక సూచనలు చేసింది.. డైవర్షన్ పాలిటిక్స్ తిప్పికొడదాం.. ప్రజా గొంతుకై నిలుద్దాం అంటూ.. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది..
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకోనున్న సీఎం చంద్రబాబు నాయుడు.. ముందుగా ఆర్థిక శాఖపై సమీక్ష చేస్తారు.. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు..
నిబంధనలకు విరుద్ధంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సంత మార్కెట్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.. సంతలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.. సంతలో ఓ చిన్న బెంచ్లపై మద్యం బాటిళ్లను పెట్టుకుని దర్జాగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.. అదికాస్తా వైరల్గా మారడంతో స్పందించిన ఎక్సైజ్, పోలీసు అధికారులు... పరారైన విక్రేతలను ఫోటోలు, వీడియోలు ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు.. ఎక్సైజ్ సీఐ మణికంఠ రెడ్డి, పట్టణ ఎస్ఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో…