CM Chandrababu: విశాఖ నుండి అమరావతి కి రెండు గంటల్లోనే చేరుకొనేలా చేస్తాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరమ్మతులకు శ్రీకారం చుట్టారు సీఎం.. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెం గ్రామం పరవాడ జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. విశాఖ నుండి అమరావతికి రెండు గంటల్లోనే చేరుకొనేలా చేస్తాం అన్నారు.. ఢిల్లీ ముంబై వరకు బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి.. అలాంటివి మనకి వస్తే ప్రయాణికులకు ఇంకా సౌలభ్యంగా ఉంటుందన్నారు.. విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ కోసం భూమి ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంది గత ప్రభుత్వం.. అధికారంలోకి రాగానే 52 ఎకరాల్లో భూమి ఇచ్చి పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇచ్చాం అన్నారు.. సంపద సృష్టిచాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి.. భవిష్యత్ లో మనకి కావాల్సిన ఎయిర్ పోర్ట్ లు, రోడ్డులు, రైల్వే.. అనకాపల్లి జిల్లా లో స్టీల్ ఫ్యాక్టరీ పెడతామని మిట్టల్ అనే వ్యక్తి ముందుకొచ్చారు అని వివరించారు..
Read Also: KTR Tweet: ప్రజాస్వామిక తెలంగాణలో మళ్లీ ఎమర్జెన్సీ రోజులొచ్చాయి..
డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రిక.. దీపం పధకం ఇస్తే అప్పుడు హేళన చేశారు.. ఇప్పుడు ఏడాదికి 3 సిలిండర్స్ ఇస్తున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. రైతులకు అండగా ఆడబిడ్డలకు డ్రోన్స్ ఇస్తాము.. పంటలకు మందులు చల్లడానికి తొడ్పడే విధంగా శిక్షణ ఇప్పిస్తాం.. 175 నియోజకవర్గాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ లు పెడతాం.. రాష్ట్రాన్ని ఇండస్ట్రీయల్ హాబ్ గా మారుస్తా.. అందుకే రతన్ టాటా హబ్ గా పేరు పెట్టాం, అయన ఒక స్ఫూర్తిగా పేర్కొన్నారు.. తెలుగు జాతిని నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లడమే నా ధ్యేయమన్న సీఎం.. డయా వాల్ ఫ్రమ్ వాల్ కొట్టుకు పోతే ఇప్పుడు ఆ పనులు మొదలెట్టాం.. పోలవరం ప్రాజెక్టును వారు గాలికొదిలేశారు.. కానీ, పోలవరం నీళ్లు విశాఖకు తీసుకొచ్చే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.. అనకాపల్లి జిల్లాకు కరువు లేకుండా నీరు సాగుదల చేస్తాం అన్నారు.. మూడు ముక్కలాట ఆడాడు ఆ దుర్మార్గుడు.. రాజధాని లేకుండా చేశాడు అంటూ మండిపడ్డారు.. విశాఖ ప్రజలకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న.. ప్రజల డబ్బుతో రుషి కొండ పాలెస్ కట్టుకున్నాడు అని విమర్శించారు… విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.. లాభల బాటలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో పరిగెత్తించాలని వ్యాఖ్యానించారు.
Read Also: TVK Party: విజయ్ రాజకీయాల్లోకి రావటం ఇండియా కూటమికే లాభం..
మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేశామని గుర్తుచేశారు చంద్రబాబు.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి, మీ భూములు గోవిందా కాకుండా చేశాం.. నా దగ్గరకు వచ్చే వాళ్ళు 70 శాతం మంది భూ తగదాల వాళ్లే.. అన్నా కాంటీన్లను మూసేశారు.. ప్రతి నియోజకవర్గంలో అన్నా కాంటీన్‌లను ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఏపీ ఏస్కోబార్, ఓ రౌడీ, ఓ సైకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఇలాంటి వాళ్లు రాష్ట్రానికి అరిష్టం అని మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు..