మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి నారా లోకేష్ భేటీ.. ఏపీని సందర్శించండి..! ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా అమెరికాలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది.. ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలతో భేటీ అయిన ఆయన.. తాజాగా ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు.. రెడ్మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా…
తిరుపతిలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న వెంకటప్రసాద్.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ ..
ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు ఏపీ మంత్రి నారా లోకేష్.. రెడ్మండ్ లోని సంస్థ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన లోకేష్ టీమ్.. మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో సమావేశం అయ్యాంది.. ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు లోకేష్ తో ఫోటోలు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన సత్య నాదెళ్ల తన అపారమైన మేథస్సుతో అంచెలంచెలుగా ఎదిగి మైక్రోసాఫ్ట్ సీఈవో స్థాయికి చేరుకున్నారు.
సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలోని యాంటీ పోచింగ్ సెల్ రూపొందించిన పోస్టర్ ను డిప్యూటీ సీఎం, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
పేదల కోసం ప్రభుత్వం నిర్మించే ఇళ్లకు స్థలం వితరణ చేసేందుకు సత్తెనపల్లికి చెందిన ఓ వృద్ధురాలు ముందుకొచ్చింది. తమ గ్రామంలోని 15 పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తే అందుకు తాను తన సొంత స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
తన అభిమాన నాయకుడిని నేరుగా కలిసి తీపి జ్ఞాపికను అందించింది ఓ విద్యార్ధిని. విజయవాడ పడమట విశ్వవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు చెందిన 8వ తరగతి విద్యార్ధిని లాస్యకు చంద్రబాబు అంటే అంతులేని అభిమానం. తన స్వహస్తాలతో గీసిన చంద్రబాబు రేఖాచిత్రాన్ని తీసుకొని సోమవారం సచివాలయానికి వచ్చింది. తాను గీసిన చిత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేయడంతో ఆయన ఆనందంతో మురిసిపోయారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 1500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీకి చేయనుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 1500 ఖాళీలను భర్తీ చేయాలని యూబీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. గత వైసీపీ సర్కార్ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేయాలని నిర్ణయించింది.. 2021 ఆగస్టు 15 తేదీ నుంచి 2024 ఆగస్టు 28 తేదీ వరకూ గోప్యంగా ఉంచేసిన జీవోలన్నింటినీ జీవోఐఆర్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తూ.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు సాధారణ పరిపాల శాఖ
కొలిమిగుండ్లలో ఆర్ఎంపీ డాక్టర్ ఆత్మహత్య ఘటనలో కీలక మలుపు తిరిగింది.. హత్య చేసి చంపింది మేమే నని మీడియా ముందు అంగీకరించారు నిందితులు.. మృతదేహాన్ని బైక్ మీద తీసుకెళ్లి గాలేరు నగరి కాలువలో పడేశామని వెల్లడించారు.. డాక్టర్ ఒంటి మీదున్న బంగారు గొలుసు, రెండు ఉంగరాలు పోలీసులకు అప్పగించారు.. అయితే, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామంలో జరిగిన ఆర్ఎంపీ డాక్టర్ కొండయ్య హత్య ఘటనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్టు అయ్యింది..