Whats Today: తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు. ముక్కంటిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు. తిరుమల: రేపు ఆన్ లైన్ లో పిభ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చెయ్యనున్న…
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ దక్షిణ బంగాళాఖాతంలోని నవంబర్ 25న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.. వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 2 రోజుల్లో తమిళనాడు-శ్రీలంక తీరాలు వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది.. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో ఈరోజు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే…
జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రం 2029లోనే ఉంటాయన్నారు.. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా.. అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని.. ముందుగా రాబోవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు..
తిరుమల శ్రీవారి భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. కాసేపట్లో శ్రీవారి దర్శనంతో పాటు.. ఇతర సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన ఫిబ్రవరి నెలకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది.
* మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కి సర్వం సిద్ధం. ఉదయం 8 గంటలకు ప్రారంభంకానున్న కౌంటింగ్ ప్రక్రియ. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు.. 8:30 నుంచి ఈవీఎంల ఓట్లను లెక్కించనున్న అధికారులు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్. * నేడు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం.. జార్ఖండ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 81, మేజిక్ ఫిగర్ 41…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్సార్ మృతి చెందిన తర్వాత జగన్ కాంగ్రెస్ విధానానికి ఎదురు తిరిగారు.. కాంగ్రెస్ విధానాల నుంచి స్వేచ్ఛగా బ్రతకాలని వైఎస్ జగన్ కాంగ్రెస్ సంకెళ్లు తెంచుకున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు చీకట్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తారని ఆరోపించారు.