టౌన్ ప్లానింగ్ లో సమూల మార్పులు చేయడానికి వేసిన కమిటీల రిపోర్టులు సీఎం చంద్రబాబుకు అందించామని తెలిపారు మంత్రి నారాయణ.. 7 టీమ్లు పది రాష్ట్రాల్లో తిరిగి అక్కడి లే ఔట్, బిల్డింగ్ అనుమతులు స్టడీ చేశారు.. 15 మీటర్లు లేదా ఐదంతస్తులు ఇల్లు కట్టే వారికి అనుమతుల్లో మార్పులు చేశాం.. లైసెన్స్డ్ సర్వేయర్లు.. వాళ్ల ప్లాన్ ను ఆన్ లైన్ లో పంపించి ఫీజు కడితే అనుమతిచ్చినట్టే భావించబడుతుంది.. ఒకవేళ ప్లాన్ డీవియేషన్లు వస్తే ఆ…
తనపై ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపకపోతే సివిల్, క్రిమినల్ కేసులు పెడతాను అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్.. అంబేద్కర్ కోనసీమ అమలాపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రెస్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ మండిపడ్డారు.. అవినీతి కేసులో త్వరలో రాష్ట్ర మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్టు అవుతారు.. వారి అవినీతిని బయట పెడతామని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.. గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చినట్టు ఏపీ సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయం ప్రకటించింది..
తనను మర్యాదపూర్వకంగా కలిసి చాగంటి కోటేశ్వరరావును సన్మానించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక సూచనలు చేశారు.. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును శాలువాతో సన్మానించిన సీఎం చంద్రబాబు.. భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాలి.. విద్యార్ధుల్లో నైతిక విలువలు పెంచేందుకు కృషి చేయండి అంటూ చాగంటి కోటేశ్వరరావుకు సూచించారు..
కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.. రాజధాని 29 గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన భూములు 34 వేల ఎకరాలు కాగా, ప్రభుత్వ భూములతో కలుపుకుని మొత్తం 58 వేల ఎకరాలున్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇందులో 24వేల ఎకరాలు కంపచెట్లతో అడవిలా మారిపోయింది. దీంతో ఈ మొత్తం జంగిల్ను తొలగించడానికి ప్రస్తుత కూటమి ప్రభుత్వం 36.50 కోట్లతో పనులు ప్రారంభించింది. ఈ కాంట్రాక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన…
విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్రంలో సౌరవిద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై అధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు నాయుడు..
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
Karthika Somavaaram:ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ శివనామంతో మారుమోగుతున్నాయి.
Heavy rains in Andhra Pradesh: ఏపీ రైతులకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.