Liquor Commission: మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం అంటున్నారు మద్యం షాపుల యజమానులు.. కడపలో సమావేశమైన వైన్స్ షాపులు, బార్ల యజమానులు మద్యం అమ్మకాలపై కమిషన్‌పై చర్చించారు.. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమంటూ స్పష్టం చేశారు.. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.. మద్యం షాపులకు ఇస్తున్న కమిషన్ ను వెంటనే పెంచాలంటూ మద్యం షాపులు, బార్ షాపుల యజమానుల సమావేశంలో పాల్గొన్న లిక్కర్ షాపుల యజమానులు డిమాండ్ చేశారు.. టెండర్ సమయంలో ప్రభుత్వం ఇస్తామన్న కమిషన్ ఇవ్వాలంటూ ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 9.5% శాతం మార్చాలని సమావేశంలో నిర్ణయించారు మద్యం షాప్ యజమానులు.. కడప నగరంలోని బాలాజీ ఇన్ హోటల్ లో ఈ సమావేశం జరిగింది..
Read Also: Bangladesh: భారతదేశ బస్సుపై దాడి.. బకాయిలు కట్టాలని బంగ్లాదేశ్‌కి త్రిపుర ఆదేశం..
ఈ నెల 5వ తేదీన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వనున్నట్టు మద్యం షాపుల యూనియన్ నేతలు వెల్లడించారు.. ఈ నెల 14వ తేదీలోపు కమిషన్ పెంపుపై నిర్ణయం తీసుకోక పోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని హెచ్చరించారు.. అంతేకాదు.. జనవరిలో కట్టాల్సిన లైసెన్సు ఫీజులు కూడా చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. మరోవైపు.. మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నారు.. అయినా తీరు మారకుండారెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే..