వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఆచూకీ లభిస్తే అరెస్టు చేసేందుకు ఒంగోలు పోలీసులు సిద్ధమయ్యారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరవుతానని ఆర్జీవీ చేసిన రెక్వెస్ట్ ను తోసిపుచ్చారు పోలీసులు.. రెండు సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇచ్చినా ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. నోటీసులను ధిక్కరించారు కాబట్టే అరెస్ట్ వరకు వెళ్ళాల్సి వచ్చిందంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు.. ఈ పర్యటన కోసం సోమవారం ఢిల్లీ చేరుకున్నారు పవన్ కల్యాణ్.. అయితే, ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. పెండింగ్ ప్రాజెక్టులు.. ఇతర అంశాలపై చర్చించనున్నారు..
ఆంధ్రప్రదేశ్ రైతులకు వాయుగుండం ముప్పు ముంచుకు వస్తోంది. కోత దశలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా వుండమని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దక్షిణ బంగాళా ఖాతంలో వున్న వాయుగుండం తమిళనాడు - శ్రీలంక దిశగా కదులుతూ బలపడుతోంది. "దాన" తీవ్ర తుఫాన్ తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర రూపం దాల్చింది. వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల…
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు వర్మ.. ప్రకాశం జిల్లా, విశాఖ జిల్లా, గుంటూరు జిల్లాల్లో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ.. హైకోర్టు మెట్లు ఎక్కారు వివాదాస్పద దర్శకుడు.. గతంలో విచారణ వాయిదా వేసిన హైకోర్టు.. అన్ని పిటిషన్లపై ఒకేసారి విచారణ చేపట్టనున్నట్టు వెల్లడించిన విషయం విదితమే..
ఆర్ అండ్ బీ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. రూ.861 కోట్లతో చేపట్టిన పాత్ హోల్ ఫ్రీ రోడ్ల నిర్మాణం సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు.. 1307 కిలోమీటర్ల పొడవైన 18 స్టేట్ హైవేలను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు.. నరేగా నిధులతో గ్రామాల్లో 13 వేల కిలోమీటర్ల అంతర్గత రోడ్లు నిర్మాణం చేపట్టాలని.. పూర్తి నాణ్యతతో రోడ్ల మరమ్మతులు జరగాలని…
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్లో “కాగిత రహిత” (పేపర్ లెస్) శాసన వ్యవస్థ అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ మేరకు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడిషనల్ కార్యదర్శి సత్య ప్రకాశ్, ఏపీ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఒప్పందంపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు..
తిరుపతి జూ లో బెంగాల్ టైగర్ మృతిచెందింది.. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో 'మధు' అనే బెంగాల్ టైగర్ మృతిచెందినట్టు అధికారులు ప్రకటించారు.. బెంగాల్ టైగర్ మధును 11 ఏళ్ల వయస్సులో 2018లో బెంగళూరులోని బన్నెరగట్ట బయోలాజికల్ పార్క్ నుంచి తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు అధికారులు..