తూర్పు గోదావరి జిల్లాలో వేమగిరి నుంచి సామర్లకోట వరకు 62 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం అంటేనే చెమటలు పడతాయి. రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాలకు వెళ్లే వారికి ఈ కెనాల్ రోడ్డే దిక్కు. ఇది పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రతిరోజు యాక్సిడెంట్లు సాధారణం అయిపోయాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా.. తీవ్ర గాయాలతో బయటపడ్డవారికి లెక్కలే లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కీలకమైన ఈ కెనాల్ రోడ్డుకు మాత్రం మోక్షం దక్కలేదు.
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పేమ పేరుతో నమ్మించి... పెళ్లి చేసుకుంటానని వంచించిన ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. విశాఖకు చెందిన లా స్టూడెంట్ను లవ్ పేరుతో ట్రాప్ చేసిన వంశీ అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేయడంతో పాటు తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.. దీంతో.. కేసు దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు..
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజక వర్గ ఎమ్మెల్యేగా వరసగా నాలుగు సార్లు గెలుపొందిన సీనియర్ శాసన సభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ హోదా దక్కనుంది. రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల నియమితులు కానున్నారు. ఇవాళ అసెంబ్లీలో అంచనాల కమిటీ ఛైర్మన్ గా నియమితులు కానున్నారు.. ఈ మేరకు వేగుళ్లకుకు ప్రభుత్వం సమాచారం ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పీఏసీ చైర్మన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ కూడా... పీఏసీ చైర్మన్ పదవికి నామినేషన్ వేయడంతో... ఆసక్తి నెలకొంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరుగుతుంది.
నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మకు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణ రాజు (91సం.లు) గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ హాస్పిటల్లో ప్రాణాలు విడిచారు.
సుమత్రా తీరంలో ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం, దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 23న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ రోజుల్లో చాలామంది హార్ట్ ఎటాక్‌తో చనిపోతున్నారు. నడుస్తూ, డ్యాన్స్ చేస్తూ, కుర్చీలో కూర్చున్నప్పుడు లేదంటే నిలుచున్నప్పుడు కూడా సడెన్‌గా గుండెపోటుతో క్షణాల్లోనే ప్రాణాలు వదులుతున్నారు. శుభకార్యాలు, పెళ్లి వేడుకల్లో సైతం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం పెనుమాడలో విషాదం చోటుచేసుకుంది.