ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'స్వర్ణాంధ్ర - 2047' డాక్యుమెంట్పై మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో 'స్వర్ణాంధ్ర 2047' డాక్యుమెంట్ రూపొందించామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుంది.. ప్రధాని మోదీ వికసిత్ భారత్ పిలుపునిచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న వేళ.. అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. మండలి వేదికగా నిన్నటి రోజున హాట్ కామెంట్లు చేసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఈ రోజు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. ఎదురుగా వెళ్లి పవన్ను పలకరించారు.. పవన్ కల్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి…
స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పెంపుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా శుభావార్త చెప్పారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. స్పోర్ట్స్ కో రిజర్వేషన్ 2 శాతం నుండి 3 శాతానికి పెంచనున్నట్టు వెల్లడించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 విజన్ తో గ్లోబల్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారుతుందని తెలిపారు.. స్పోర్ట్స్ కోటాలో 2 శాతం నుండి 3 శాతానికి రిజర్వేషన్ పెంచుతాం.. ఒలంపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన వారికి ఉద్యోగ…
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై శాససనమండలి ప్రశ్నోత్తరాల్లో సమాధానం ఇచ్చిన మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ పై సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్రానికి పంపించాం. కేంద్రం నుంచి అనుమతి రాగానే ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తాం అని స్పష్టం చేశారు.. ఇక, వంద శాతం కేంద్రమే నిధులు భరించేలా నిర్మాణం చేపట్టాలని కోరామని వెల్లడించారు..
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి,
సంప్రదాయం ప్రకారం నేటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు.. కానీ, మీరు ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఏం మెసేజ్ ఇద్దామని ఇప్పుడు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ.. CAG అకౌంట్స్ ను నిర్ధారించగలిగేలా PACని రాజ్యాంగంలో చేర్చారు.. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా PAC ఇవ్వడం జరుగుతోందన్నారు
పీఏసీ చైర్మన్ పదవి విషయంలో ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.. అందుకే తాము ఎన్నికలు బహిష్కరిస్తున్నాం అని ప్రకటించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. పీఏసీ చైర్మన్ ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న వారికి ఇవ్వలేదని గుర్తుచేశారు.. ఆర్టికల్ 309 ప్రకారం ప్రతిపక్ష నాయకుడికే ఇవ్వాలని స్పష్టం చేశారు.. అంతెందుకు 1981, 82లో బీజేపీకి ఇద్దరే ఉన్నా వారికే PAC చైర్మన్ ఇచ్చారన్నారు.. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేక పర్యాయాలు…
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన రెండు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇప్పటికే దాఖలు చేసిన పిటిషన్ తో కలిపి వచ్చే మంగళ వారం విచారణ చేస్తామని ఈ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది..