Egg Prices: ప్రస్తుతం కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా 7 రూపాయలను దాటేసింది. కార్తీకమాసం ముగియడంతో.. గుడ్డు ధర అమాంతం పెరిగిపోయింది. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ఒక గుడ్డు ధరను రూ.6.20గా నిర్ణయించగా.. 30 గుడ్ల ట్రే ధర 186 రూపాయలుగా ఉంది. ఇక, వెన్‌కాబ్ లాంటి కొన్ని చికెన్ విక్రయ సంస్థలు 12 గుడ్లను 85 రూపాయలకు అమ్ముతున్నాయి. అంటే ఒక్కో గుడ్డు ధర 7.08 రూపాయలుగా ఉంది. ఇక, హైపర్ మార్కెట్లు, ఆన్‌లైన్‌లో ప్రొటీన్ గుడ్లు, నౌరిష్ గుడ్లు, విటమిన్ –డి, విట్రిచ్, హై ప్రొటీన్, బ్రౌన్ ఎగ్స్‌గా ప్యాక్ చేసి అమ్మకాలు చేసి ఒక్కో గుడ్డు ధర 10 నుంచి 20 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. అలాగే, హెర్బల్ గుడ్ల పేరిట ఓ కంపెనీ ఆన్‌లైన్ మార్కెట్లో కేవలం 6 గుడ్లను ఏకంగా 112 రూపాయలకు విక్రయిస్తోంది.
Read Also: Eknath Shinde: హోం మంత్రి పదవి కావాలని ఏక్‌నాథ్ షిండే డిమాండ్..
అయితే, సామాన్యులు ఇళ్ల దగ్గరి కిరాణం షాప్స్ ల్లో రిటైల్‌గా కొనుగోలు చేసే గుడ్లను ఏడు రూపాయలకే అమ్ముతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.. దీంతో గుడ్డు ధరలు భారీగా పెరిగాయని తెలంగాణ పౌల్ట్రీ పరిశ్రమ పేర్కొనింది. కోళ్లకు ప్రధాన దానా అయిన మొక్కజొన్న ధర పెరగటంతోనే గుడ్డు ధర పెంచాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఇక, దేశంలో సౌత్ ఇండియా రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోనే పౌల్ట్రీ పరిశ్రమ ప్రధానంగా కేంద్రీకృతమై ఉంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రతి రోజు 32 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తి జరుగుతుంది.. అయితే, ఈ మూడు రాష్ట్రాల్లోనే 15 కోట్ల వరకు గుడ్ల ఉత్పత్తి అవుతుందన్నారు. రోజూ 5 కోట్లకు పైగా గుడ్ల ఉత్పత్తితో ఏపీ, తెలంగాణ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.