Andhra Pradesh: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అనుసరిస్తున్న విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. అత్యుత్తమ పనితీరును కనబరిచిన పంచాయతీలకు కేంద్ర సర్కారు ఇచ్చే జాతీయ స్థాయి పురస్కారాలుకు నాలుగు గ్రామాలు ఎంపిక కావడం విశేషం. రాష్ట్రంలోని నాలుగు పంచాయతీలకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు లభించాయి. నాలుగు విభాగాల్లో అవార్డులు లభించగా.. అవార్డులు పొందిన పంచాయతీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
Read Also: Mopidevi: కన్నులపండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు ప్రారంభం
హెల్దీ పంచాయత్ అనే విభాగంలో చిత్తూరు జిల్లాలోని బొమ్మ సముద్రం ఎంపిక కాగా.. వాటర్ సఫిషియెంట్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని న్యాయంపూడి.. క్లీన్ అండ్ గ్రీన్ విభాగంలో అనకాపల్లి జిల్లాలోని తగరంపూడి.. సోషల్లీ జస్ట్ అండ్ సోషల్లీ సెక్యూర్డ్ పంచాయత్ విభాగంలో ఎన్టీఆర్ జిల్లాలోని ముప్పాళ్ళ గ్రామాలు ఎంపికయ్యాయి. రాష్ట్ర పంచాయతీల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.