Amaravati Construction Work: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గతంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు చకచకా అడుగులు వేస్తోంది.. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించారు.. ఆ తర్వాత నిపుణుల సలహాలు.. సూచనలు.. భవనాల పటిష్టత ఇలా.. ఒక్కో అడుగు ముందుకు పడుతో వచ్చింది.. ఇక, అమరావతిలో భవనాలను పునఃప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. డిసెంబర్ 15వ తేదీ నుండి బిల్డింగ్ యాక్టివిటీని ప్రారంభించనుంది.. ఎంపిక చేసిన కొన్ని కన్‌స్ట్రక్షన్ మేజర్‌లకు వివిధ ప్రాజెక్ట్ వర్క్‌లు అప్పజెప్పనున్నారు.. ఇక, పాత కాంట్రాక్టులను రద్దు చేసి తాజాగా బిడ్‌లను ఆహ్వానించేందుకు ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపిన విషయం విదితమే.. కానీ, సాధ్యమైనంత వరకు పాత కాంట్రాక్టర్‌ల తోనే పని జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. బిడ్డింగ్ ప్రక్రియకు అధికారిక గడువు త్వరలో ముగియగానే ఎంచుకున్న సంస్థలకు వర్క్ ఆర్డర్‌లు జారీ చేయనున్నారు..
Read Also: Pawan Kalyan : చదువు ఉద్యోగం కోసమే కాదు జ్ఞానం సంపాదించుకోవడానికి…
ఎమ్మెల్యేలు, ఏఐఎస్ అధికారుల హౌసింగ్ ప్రాజెక్ట్ చేసిన నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకే మరలా కాంట్రాక్ట్ పనులు అప్పగించనున్నారు.. హ్యాపీ నెస్ట్, గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ పనులను చేయడానికి ఎన్‌సీసీని ఎంపిక చేశారు.. ఇంజినీరింగ్ మేజర్ L&T కే మళ్లీ NGOల హౌసింగ్ ప్రాజెక్ట్ అప్పగించగా.. ఇప్పుడు రెండు భాగాలుగా NGOల హౌసింగ్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.. ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ నిబంధనల ప్రకారం “హై రిస్క్ ప్రాజెక్ట్”గా NGOల హౌసింగ్ మొత్తం ఖర్చు 1872.74 కోట్లుగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్\ADB నుండి నిధులు కోరింది ఏపీ సీఆర్‌డీఏ.. మరో నిర్మాణ ప్రధానమైన KMV ప్రాజెక్ట్స్‌కు IAS అధికారుల బంగ్లాల నిర్మాణాలకు తిరిగి అప్పగించనున్నారు.. BSR ఇన్‌ఫ్రా నే న్యాయమూర్తులు, మంత్రుల బంగ్లాల పనికి మళ్లీ ఎంపిక చేసింది ప్రభుత్వం.. ఏపీ సీఆర్‌డీఏ డిసెంబర్ 15వ తేదీ నుంచి ప్రాజెక్ట్‌ల కోసం టైమ్‌లైన్‌లను రూపొందించింది..
Read Also: Ganja Smuggling: ఏం ఐడియా రా బాబు.. కుటుంబంగా ఏర్పడి కారులో గంజాయి విక్రయం..
ఇక, ఎమ్మెల్యేలు, AIS ఆఫీసర్స్ క్వార్టర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్, ఎన్జీవోస్ క్వార్టర్స్, జడ్జీలు, మంత్రులు, AIS ఆఫీసర్ల బంగ్లాల నిర్మాణాలు డిసెంబర్ 15వ తేదీ నుంచి పునఃప్రారంభంకానున్నాయి.. MLA భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ఆరు నెలల గడువు విధించారు.. AIS క్వార్టర్స్, ఇతర గృహ నిర్మాణ పనులకు తొమ్మిది నెలల డెడ్‌లైన్ పెట్టగా.. ఈ ప్రైమ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు అన్నింటికీ ఖర్చు 1,132.71 కోట్ల రూపాయలకు పెరిగింది.. 2019 మధ్యలో అవి మిగిలి ఉన్న వాటితో పోలిస్తే సగటున 80.3 శాతం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.. సీనియర్ AIS అధికారుల బంగ్లాలు అత్యధికంగా 86.55 శాతం పెరిగిపోగా.. ఒక్కో ఎస్‌ఎఫ్‌టీ ధర 6,307 (2017లో పాత అంచనా ప్రకారం) రూపాయల నుండి ఇప్పుడు 10,829 రూపాయాలకు పెరిగింది.. NGOల గృహాలకు ప్రతి ఎస్‌ఎఫ్‌టీ ధర రూ.3,061 నుండి రూ.4,410కి పెరిగింది.. గెజిటెడ్ ఆఫీసర్ల ఫ్లాట్ల విషయంలో, ఒక్కో ఎస్‌ఎఫ్‌టీ ధర రూ. 3,255 నుండి రూ.4,556కి పెరిగింది..