కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా.. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.. కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట బూతు పాటలకు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు..
రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. గత ఎన్నికల్లో యూటీఎఫ్ తరఫున గెలిచిన షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.
AP-TG Earthquake: తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. బుధవారం తెల్లవారుజామున తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, చర్ల, ఖమ్మంలోని మణుగూరు సహా పలు చోట్ల భూమి కంపించింది.
వైసీపీ కంచుకోట పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్. ఈ ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో... అభ్యర్థితో సంబంధం లేకుండా పార్టీకి ఓట్లు పడిపోతాయి. అందుకే 2014, 2019, 2024లో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టగలిగింది. గత ఎన్నికల్లో అయితే... రాష్ట్రం మొత్తం కూటమి ప్రభంజనం సృష్టించినా... ఇక్కడ మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన మత్స్యరాస విశ్వేశ్వరరాజు...
తోట త్రిమూర్తులు, వైసీపీ ఎమ్మెల్సీ.. గతంలో రామచంద్రపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారాయన. అప్పటి పరిణామాలను బట్టి వేర్వేరు పార్టీల తరపున ప్రాతినిధ్యం వహించారు. అయితే... గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు మండపేట నుంచి తొలిసారి బరిలో దిగి ఓడిపోయారు త్రిమూర్తులు. అయితే ఇప్పుడాయన లెక్కలు పూర్తిగా మారిపోతున్నట్టు తెలుస్తోంది. మొదట్నుంచి రాజకీయం కంటే తనకు కులమే ముఖ్యమని చెప్పే తోట త్రిమూర్తులు...
టీడీపీలో మాజీ మంత్రి ఆళ్ల నాని చేరికకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.. ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు.. ఆళ్ల నాని.. టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అంతేకాదు.. ఆళ్లనాని టీడీపీలోకి వస్తే.. ఆయన వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని.. పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తేల్చిచెప్పారు.. గతంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి.. వేధింపులకు గురిచేశారని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, ఆళ్ల నాని చేరికను పోస్ట్‌పోన్ చేసింది టీడీపీ.. ఏలూరు జిల్లా…
ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.. కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్.. అయితే, బాధితురాలు తరపున వాదనలు వినిపించారు పీపీ లక్ష్మీనారాయణ, న్యాయవాది నర్రా శ్రీనివాస్.. నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని.. బాధితురాలు జత్వానీ తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీనారాయణ…