స్కూల్ గోడ కూలి మూడో తరగతి విద్యార్థిని మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం విద్యానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉర్దూ స్కూలులో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మాహిన్... స్కూల్ ప్రహరీ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి వయస్సు ఎనిమిదేళ్లు..
కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ఈ రోజు కర్నూలు, కడప, అనంతపురం-హిందూపురం యూడీఏలపై సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ.. ఆయా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల (యూడీఏ) పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై సంబంధిత అధికారులకు దిశానిర్ధేశం చేశారు మంత్రి నారాయణ..
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వాని కేసులో నిందితుడు కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.. అయితే, జత్వాని కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ .. ఇక, హైకోర్టులో జత్వానీ, పోలీసుల తరుపు న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మీ నారాయణ వాదనలు వినిపించారు.. బెయిల్ మంజూరు చేస్తే…
ఆంధ్రప్రదేశ్‌లో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది విద్యాశాఖ.. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది అంటున్నారు.. పాఠశాల విద్యాశాఖ సెక్రెటరీ కోన శశిధర్.. ఈ నెల 7వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తాం.. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహణ ఉందన్నారు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ రోజు నిర్వహించాల్సిన PSLV-C59 రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.. కౌంట్‌డౌన్ ప్రక్రియ మంగళవారం రోజు ప్రారంభం కాగా.. కౌంట్‌డౌన్‌ను విజయవంతంగా ముగించుకుని ఈ రోజు సాయంత్రం 4.12 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ దావన్ అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉంది.. అయితే, చివరి క్షణాల్లో ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది ఇస్త్రో.
ఈ రోజు సస్పెన్షన్ కు గురైన తుని ఆర్టీసీ డిపో డ్రైవర్ లోవరాజు మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన సస్పెన్షన్ రద్దుచేయించి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా చొరవ చూపించిన మంత్రి లోకేష్ ను కుటుంబ సభ్యులతో సహా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ డిపోలో లోవరాజు అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన వైసీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం ముగిసింది.. ఈ సమావేశంలో పోరుబాట కార్యాచరణ ప్రకటించారు వైఎస్ జగన్.. రైతు సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు, కలెక్టర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వనుంది వైసీపీ.. డిసెంబర్ 27న కరెంట్ ఛార్జీలపై ఆందోళనకు పిలుపునిచ్చారు.. కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ SE,CMD కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించాలని.. విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది..
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్‌ను దాటింది.. వరుసగా 33వ నెల 100 కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా 111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీనితో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా 1,253 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది.. ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.. అయితే, మంగళగిరిలోని సీసీఎల్ఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్లు.. జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..