R. Krishnaiah: ఆ మధ్యే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్య.. మరోసారి పెద్దల సభలు అడుగుపెట్టబోతున్నారు.. దీని కోసం.. రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఆర్.కృష్ణయ్య.. అయితే, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఏ పార్టీలో ఉన్నా.. తాను బీసీల సంక్షేమం కోసం పని చేస్తాను అని స్పష్టం చేశారు.. అయితే, నేను ఏ పార్టీలోకి వెళ్లలేదు.. నన్నే పిలిచి సీటిచ్చారని పేర్కొన్నారు.. నేను ఏపార్టీలో ఉన్నా బీసీల కోసమే పని చేస్తా అంటున్నారాయన.. అయితే కేంద్రంలో ఉన్న అధినాయకత్వం బీసీలే.. ఇక్కడ నేను బీజేపీ బలోపేతానికి పని చేస్తా అంటున్నారు..
Read Also: Vizag Honey Trap Case: జాయ్ జెమిమా హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఇక, బీజేపీయే నన్ను ఆహ్వానించి రాజ్యసభ సీటు ఇచ్చిందని తెలిపారు ఆర్.కృష్ణయ్య.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిలకు ఈ సందర్‌భంగా అభినందనలు తెలిపారు.. ఎప్పుడైనా పార్టీలే నా దగ్గరకి వచ్చాయి.. కానీ, నేను పార్టీ మారలేదన్నారు.. 2014లో తెలంగాణ సీఎం చేస్తా అంటూ చంద్రబాబు పిలిచారు.. ఆ తరువాత వైసీపీ పిలిచి రాజ్యసభ ఇచ్చింది.. కానీ, మాట్లాడాలని చూసినా అవకాశం రాలేదు నాకు వైసీపీలో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. బీసీలకు అవకాశల కోసం పోరాడాను.. అధికారం నాకు అవసరం లేదు.. రాజీనామా చేసిన తరువాతే నన్ను బీజేపీ పిలిచిందని స్పష్టం చేశారు.. బీసీలకు లాభం జరుగుతుందంటే ఎక్కడికైనా వెళ్తాను అన్నారు.. బీసీల కోసమే పోరాడతాను.. అవకాశం ఉన్నపుడు పార్టీ కోసం పని చేస్తాను అన్నారు ఆర్.కృష్ణయ్య.. కాగా, ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజీపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్యతో పాటు.. టీడీపీ అభ్యర్థులు బీదా మస్తాన్ రావు, సానా సతీష్ కూడా నామినేషన్లు వేశారు..